BIG BOSS 9: బిగ్ బాస్ 9 మొదటి ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది..ఎవరూ ఊహించని కంటెస్ట్ంట్..

బిగ్ బాస్ 9 మొదటి ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది. నామినేషన్లో ఉన్న తొమ్మిది మందిలో నిన్న తనూజ గౌడ సేఫ్ అయిపోయింది. మిగతా వారిలో తక్కువ ఓటింగ్ తో ఉన్న శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయిందని తెలుస్తోంది.

New Update
srashti (1)

బిగ్ బాస్ 9 మొదలైంది. అప్పుడే వారం కూడా గడిచిపోయింది. ఈరోజు మొదటి ఎలిమినేషన్ డే. ఆదివారం నాగార్జున కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నాడు. ఈసారి బిగ్ బాస్ మొదటి నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు కొత్త ముఖాలు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజనగల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్‌లో నిలిచారు. శనివారం ఎపిసోడ్ లో తనూజ్ సేఫ్ అయిపోయింది. మిగతా వారి భవితవ్యం ఈ రోజు తేలిపోనుంది. అయితే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. దీంతో మొదటి ఎలిమినేటెడ్కంటెస్ట్ ఎవరో తెలిసిపోయింది.

శ్రష్టి వెళ్ళిపోయింది...

ఈ వారం ఓటింగ్ ప్రారంభమైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ ఎప్పుడూ తక్కువ ఓట్స్‌లో ఉండటం గమనార్హం. మళ్ళీ ఇందులో ఆశాషైనీ సేఫ్ అవ్వగా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈమెకు ఓట్లు ఎక్కువ రాకపోవమే ఇందుకు కారణం. మొదటి వారంలో ఈమె పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందని చెబుతున్నారు.

రెండు లక్షలు మాత్రమే..

ఎలిమినేట్ అయింది శ్రష్టి వర్మ అని తెలియగానే రెమ్యునరేషన్ విషయం పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమాచారం ప్రకారం ఈమెకు రోజుకు సుమారు రూ. 28,571 పారితోషికం పొందినట్లు తెలుస్తోంది. అంటే వారం రోజులు హౌస్‌లో ఉండటంతో కలిపి దాదాపు రూ. 2 లక్షలు సంపాదించింది శ్రష్టి. అయితే.. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే.. ఈ అమౌంట్ తక్కువని చెబుతున్నారు.

Also Read: UK: లండన్ లో మిన్నంటిన ఆందోళనలు..ఉద్యమం చేసిన వలన వ్యతిరేకవాదులు

Advertisment
తాజా కథనాలు