Bhairavam: నెక్ట్స్ మూవీ టీజర్ వదిలిన మనోజ్.. అన్న 'కన్నప్ప'కు కౌంటర్ అదిరిందిగా..!

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'భైరవం'. తాజాగా మేకర్స్ ఈమూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఉదయం మంచు విష్ణు కన్నప్ప నుంచి పోస్టర్ రిలీజ్ కాగా.. సాయంత్రం మనోజ్ మూవీ టీజర్ విడుదల కావడం ఆసక్తికరంగా మారింది.

New Update

భైరవం టీజర్ 

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో మనోజ్, శ్రీను, నారా రోహిత్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీను గాడి కోసం ప్రాణాలు ఇస్తా.. వాడి జోలికి ఎవడైనా వస్తే.. నా కొడక్కా ప్రాణాలు తీస్తా అంటూ మనోజ్ డైలాగ్స్ హైప్ పెంచుతున్నాయి. ఒక ఊరు, ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ స్క్రీన్ పై కనిపించడం ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం మంచు విష్ణు కన్నప్ప నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ కాగా.. సాయంత్రానికి  మనోజ్ మూవీ టీజర్ విడుదల కావడం ఆసక్తికరంగా మారింది.

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు