/rtv/media/media_files/2025/10/13/bhagyashree-borse-2025-10-13-10-10-51.jpg)
Bhagyashree Borse
Bhagyashree Borse: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ప్రస్తుతం "ఆంధ్ర కింగ్ తలూకా"(Andhra King Taluka) అనే విలేజ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హీరోయిన్‌గా భగ్యశ్రీ బోర్స్ నటిస్తున్నారు.
టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..
సినిమా పాటలు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రామ్ పాత్ర "సాగర్"గా పరిచయం చేసారు, సినిమాపై ప్రేమతో పాటు తన ప్రేయసిపై ఉన్న తీరని ప్రేమను చూపించారు. రామ్ పాత్రలో ఉన్న ఎనర్జీ, మాస్ యాంగిల్‌తోపాటు లవ్ సీన్స్ కూడా ఈ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
రామ్‌పై భాగ్యశ్రీ బోర్సే పొగడ్తలు
ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే తన కో-స్టార్ రామ్‌పై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపించార. ఆమె తన ట్వీట్‌లో,
"ప్రియమైన రామ్ గారు, సాగర్‌గా మీరు తెరపై చూపించబోయే మ్యాజిక్‌ను ప్రేక్షకులు చూస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా. మీ కష్టం చూసి నేను ఆశ్చర్యపోయాను. నీ అభిమానులే నీ బలం. నీకు నా అభినందనలు!" అంటూ రాసింది. ఈ వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆమె పేర్కొన్న విధంగా, రామ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ అతనికి ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుంది అనే మాట నిజమే.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
మాస్ & క్లాస్ టచ్
ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో రామ్‌కు కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. పాటలు, విజువల్స్ కూడా అందంగా కనిపిస్తున్నాయి.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
విడుదల తేదీ ఫిక్స్!
ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లు కూడా బాగా ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. పాటలు, టీజర్‌తో మంచి హైప్ ఏర్పడింది. ప్రేక్షకులు ఇప్పటికే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
"ఆంధ్ర కింగ్ తలూకా" రామ్ కెరీర్‌లో మరో మాస్ హిట్ అవుతుందా? భాగ్యశ్రీ బోర్సేతో జోడిగా రామ్ మ్యాజిక్ వర్కౌట్ చేస్తుందా? అన్నది నవంబర్ 28న స్క్రీన్‌పై తెలుస్తుంది. కానీ ఇప్పటికే వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది!