Kishkindhapuri: 'OG' వచ్చే వరకు నా సినిమా ఆగదు: బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటించిన "కిష్కింధపురి" హారర్-ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా వచ్చినా మంచి కంటెంట్‌తో థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా డీసెంట్ థ్రిల్లర్‌గా నిలిచింది.

New Update
Kishkindhapuri

Kishkindhapuri

Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరోగా నటించిన తాజా చిత్రం "కిష్కింధపురి" సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. చిన్న సినిమాగా వచ్చినా, ఎమోషనల్ కంటెంట్, హారర్ టచ్‌తో మంచి రెస్పాన్స్ సాధించింది.

సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో, హీరో శ్రీనివాస్, డైరెక్టర్ కౌశిక్, నిర్మాత సాహు గారపాటి, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ పాల్గొన్నారు.

Also Read: అప్పుడే 'మిరాయ్'కి పైరసీ దెబ్బ‌.. మరీ ఇలా ఉన్నారేంట్రా!

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...

“పవన్ కల్యాణ్ 'ఓజీ'(Pawan Kalyan OG) సినిమా వచ్చే వరకు మా సినిమా థియేటర్లలో ఆడుతూనే ఉంటుంది. ఇది ఆత్మవిశ్వాసంతో చెప్పుతున్న మాట,” అని తెలిపారు.

Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

అలాగే  “ఇది పెద్ద సినిమా కాదు, కానీ ప్రేక్షకులను టచ్ చేసే కథ ఉంది. అందుకే మమ్మల్ని సపోర్ట్ చేయండి,” అని పేర్కొన్నారు. కిష్కింధపురి సినిమా కథ రివేంజ్ డ్రామా మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాల మేళవింపూ ఉంది. ప్రధాన పాత్రలు ఎలా మారుతున్నాయి, వాటి వెనుక ఉన్న మోటివేషన్స్ ఏమిటి  ఇవన్నీ చాలా ఆసక్తికరంగా చూపించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రకు తగ్గట్టు బాగా నటించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రలో మంచి ఫీలింగ్‌ తీసుకువచ్చింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయింది. దర్శకుడు కథను నడిపించిన విధానం ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశారు.

Also Read:ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?

అయితే, కొన్ని సీన్స్‌ వల్ల కథ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో వేగం తగ్గింది. మరికొన్ని సీన్స్‌లో ప్రేక్షకులలో ఆసక్తి కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ ఇవన్నీ చిన్న మైనస్‌లే. మొత్తం మీద ఈ సినిమా ఓవర్‌ఆల్‌గా ఓ డీసెంట్ హారర్ ఎంటర్‌టైనర్.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్లలో థ్రిల్‌ను పెంచింది. విజువల్స్ కూడా కథకి బాగా హెల్ప్ అయ్యాయి. దర్శకుడు కౌశిక్ టేకింగ్ కూడా కథను కంటిన్యూగా క్యారీ చేయడంలో సహాయపడింది.

Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!

"కిష్కింధపురి" ఒక పెద్ద బడ్జెట్ సినిమా కాకపోయినా మంచి కంటెంట్, యాక్టింగ్, టెక్నికల్ విలువలతో ప్రేక్షకులను థియేటర్లలో ఎంగేజ్ చేసేలా చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తగా ట్రై చేసిన జానర్ ఇది. హారర్, ఎమోషన్, యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు ఇది ఓ మంచి త్రిల్ ఇస్తుంది తప్పకుండ వెళ్లి ఒకసారి చూసేయొచ్చు. 

Advertisment
తాజా కథనాలు