/rtv/media/media_files/2025/09/12/mirai-piracy-2025-09-12-18-46-45.jpg)
MIRAI PIRACY
MIRAI PIRACY: యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) మరోసారి తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం "మిరాయ్" (Mirai Movie) సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఇక మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో విలన్ గా కనిపించారు.
మిరాయ్ సినిమా ఒక డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కింది. ఇది కేవలం యాక్షన్ ఫిల్మ్ కాదు, ఇందులో మైథలాజికల్ టచ్, ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు “ఇది ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది” అని అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?
తేజ సజ్జా ఈ సినిమాలో సూపర్ యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. అతని యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుండగా, విలన్ పాత్రలో మంచు మనోజ్ కూడా తన స్టైల్‌కి తగ్గట్టు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
ప్రీమియర్ షోల నుంచే "మిరాయ్" పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో పూర్తయ్యే సరికి సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, విజువల్స్ అదిరిపోయాయి, టెక్నికల్ క్వాలిటీ హై స్టాండర్డ్‌లో ఉంది అంటూ ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు, విశ్లేషకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.
Also Read:నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!
'మిరాయ్'కి పైరసీ దెబ్బ..
అయితే, అన్ని సినిమాలకి లాగానే తేజ సజ్జ మిరాయ్ కి కూడా పైరసీ దెబ్బ తగిలింది. సినిమా విడుయాదలైన సాయంత్రానికే ఇంకా ఫస్ట్ షో కూడా అవ్వక ముందే సినిమా పైరసీ బియటకొచ్చేసింది. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పైరసీ బాధ ఎక్కువైంది. సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే..hd ప్రింట్ ఆన్ లైన్లో ప్రత్యక్షమవుతోంది. చిన్న హీరో, స్టార్ హీరోల సినిమా అని తేడా లేకుండా విడుదలైన మొదటి రోజే సాయంత్రానికి పైరసీ భూతానికి సినిమాలు బలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు విడుదలైన తేజ సజ్జ 'మిరాయ్' కూడా పైరసీకి గురైంది. సినిమాకు సంబంధించిన ఫుల్ hd ప్రింట్ ఆన్ లైన్లో దర్శనమిచ్చింది. పైరసీ వెబ్‌సైట్లలో, టెలిగ్రామ్ గ్రూపుల్లో సినిమా లింకులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సినీ నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read:'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
మిరాయ్ ఒక వైపు యంగ్ హీరో తేజ సజ్జ కి మరో హిట్‌ను అందించగా, మరోవైపు చిన్న బడ్జెట్‌తో తీసిన సినిమాలు కూడా టెక్నాలజీ సహాయంతో ఎంత పెద్ద విజువల్ ఎఫెక్ట్ చూపించగలవో నిరూపించింది. మైథలాజికల్ యాక్షన్ డ్రామాలకి ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి. పైరసీని ని అస్సలు ఎంకరేజ్ చెయ్యొద్దని సినీ నిర్మాతకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథ, నాణ్యమైన టెక్నిక్స్, మరియు కొత్త అనుభూతి కావాలనుకునే ప్రేక్షకులకు మిరాయ్ తప్పకుండా వర్త్ వాచింగ్ మూవీ.