Daku Maharaj: 'డాకు మహారాజ్' ఆ భాషల్లోనూ రిలీజ్ అవుతుందా? పెద్ద ప్లానే.!

బాలయ్య 'డాకు మహారాజ్' మూవీని తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో హిందీ, తమిళ భాషల్లో అదే రోజున రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

New Update
daku maharaj release in hindi tamil

balayya daku maharaj

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ‘డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్’ బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించింది. రెండో పాట ‘చిన్ని’ ఎమోషనల్ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన తమన్ మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్స్ మోత మోగడం  ఖాయమని ఇటీవల నిర్మాత నాగ వంశీ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. 

Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్

ముందుగా కేవలం తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో హిందీ, తమిళ భాషల్లోనూ అదే రోజున అంటే జనవరి 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా డబ్బింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 9న అనంతపురంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.

Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్

Advertisment
తాజా కథనాలు