Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డాకు మహారాజ్'. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి ఇలా వరుస విజయాలతో ఊపుమీదున్న బాలయ్య 'డాకు మహారాజ్' తో మరో హిట్టు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనంతపూర్ లో డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. చీఫ్ గెస్టుగా నారా లోకేష్.. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరు కానున్నట్లు టాక్. దీంతో ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫార్చూన్ ఫోర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్స్ గా నటించారు. సీమ అభిమానం ఎలా ఉంటుందో చూపించడానికి ముస్తాబవుతున్న అనంతపురం 🥳🥳🥳#DaakuMaharaaj Pre-release on 9th Jan 2025 😎😎Chief Guests: @naralokesh @ssrajamouli Get Ready to witness the craze of Balayya ✊✊ pic.twitter.com/kzl73M1I55 — Red Book (@RedBook_TDP) January 5, 2025 Also Read: Winter: మగవారి కంటే ఆడవాళ్ళకి చలి ఎందుకు ఎక్కువ ? కారణం తెలుసుకోండి..మీకే మంచిది