Akhanda 2: రిలీజ్ కు ముందే అఖండ 2 రికార్డులు.. వామ్మో అన్ని కోట్లా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా ఇప్పటికే 145 కోట్లు రికవరీ అయ్యాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌తో బాలకృష్ణను 100 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

New Update
Akhanda 2 Update

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమాకు అన్ని వర్గాల్లో మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత, దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈసారి మేకర్స్ బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయకుండా, ఏకంగా 150 కోట్ల నుండి 200 కోట్ల మధ్య వ్యయం చేస్తున్నట్టు సమాచారం. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

బడ్జెట్‌లో 80%-90% రికవరీ..?

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలో మేకర్స్ ఇప్పటికే భారీగా వసూలు చేసినట్టు టాక్. సమాచారం ప్రకారం, ఓటీటీ హక్కులు దాదాపు 85 కోట్లు, శాటిలైట్ హక్కులు సుమారు 60 కోట్లుకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొత్తం కలిపితే, 145 కోట్లు నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో రాబట్టినట్లు అంచనా. ఈ మొత్తం వాస్తవమే అయితే, థియేటర్లలో విడుదలకుముందే బడ్జెట్‌లో 80%-90% వరకు తిరిగి వచ్చేసినట్లే.

Also Read: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇది మేకర్స్‌కు చాలా పెద్ద ప్లస్‌ పాయింట్. ఎందుకంటే, ఇకపై థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తమంతా లాభంగానే భావించవచ్చు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘అఖండ 2’ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లు వరకూ చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

ఇంకో విషయమేంటంటే, బాలకృష్ణ ఇప్పటివరకు ఏ సినిమాతోనూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టలేదు. అయితే ‘అఖండ 2’ మాత్రం ఆ మైలురాయిని దాటే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. థియేట్రికల్ హక్కుల అమ్మకాలు, వసూళ్లు ఎలా ఉంటాయన్న దానిపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. మాస్, యాక్షన్ సినిమాలకు బాలకృష్ణకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ‘అఖండ 2’ మరో రికార్డు బ్రేకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు