రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి' సినిమా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలను కలిపి ఇటీవల మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే 'బాహుబలి' కథను యానిమేషన్ రూపంలో తీసుకురాబోతున్న విషయం ఇది వరకే రాజమౌళి ప్రకటించారు. అయితే రీ రిలీజ్‌లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్‌ను కూడా చూపించారు. అయితే తాజాగా దీన్ని విడుదల చేశారు. ఇది మొత్తం యానిమేషన్ సిరీస్. రమ్యకృష్ణ (శివగామి) గంభీరమైన డైలాగ్‌తో మొదలైంది. "బాహుబలి మరణం ఒక ముగింపు కాదు... అది ఒక మహా కార్యానికి ప్రారంభం... తన గమ్యం యుద్ధం" అనే మాటలు కథపై మరింత ఆసక్తిని పెంచాయి. టీజర్‌లో చూపించిన దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్లడం, అక్కడ ఒక శివలింగం ముందు నృత్యం చేయడం వంటి సన్నివేశాలను ఇందులో చూపించారు. ఇవన్నీ సినిమా కథ కొత్తగా, ఆధ్యాత్మిక అంశాలతో ఉండబోతుందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘రాజా సాబ్’ వాయిదాపై కీలక అప్డేట్
Amarendra Baahubali’s death wasn’t his End…it was the beginning of something Eternal. 🔥#BaahubaliTheEternalWar Teaser out now!
— Baahubali (@BaahubaliMovie) November 4, 2025
Telugu: https://t.co/sj4FkCLo5s
Hindi: https://t.co/waTg71bKIe
Tamil: https://t.co/6YYjTrc4RD#Baahubali@ssrajamouli#Prabhas@meramyakrishnan… pic.twitter.com/qDdERcMX7e
యానిమేషన్ అదిరిపోయిందని..
బాహుబలి కోసం ఇంద్రుడు, విశాసురుడు అనే ఇద్దరు దేవతలు భయంకరంగా పోరాటం చేయడం, చివరకు విశాసురుడు ఓడిపోవడం ఈ టీజర్‌లో ముఖ్యంగా కనిపించింది. అలాగే బాహుబలి యమలోకానికి ప్రయాణించడం కూడా ఇందులో చూపించారు. దర్శకుడు ఇషాన్ శుక్లా ఈ యానిమేషన్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. దీనికి దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దీని పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ యానిమేషన్ సిరీస్ 2027లో విడుదల కానుంది. ఈ 'ది ఎటర్నల్ వార్' యానిమేషన్ కథనం, అసలు బాహుబలి సినిమా కథకు పూర్తిగా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ ప్రకారం ఆకాశ లోకంలో బాహుబలి చేసే యుద్ధ విన్యాసాలు చాలా అద్భుతంగా, కొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ యానిమేషన్ కూడా టాప్‌లో ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Shraddha Das: ఓల్డ్ బట్ క్యూట్.. వయొలెట్ కలర్ శారీలో మెరిసిపోతున్న శ్రద్ధా దాస్
Follow Us