/rtv/media/media_files/2025/11/04/raaja-sab-movie-2025-11-04-15-38-51.jpg)
raaja sab movie
డైరెక్టర్ మారుతి, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ది రాజా సాబ్'. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ప్రచారంపై స్పందించింది. రిలీజ్ చేస్తామన్న డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని తెలిపింది.
ఇది కూడా చూడండి: Nandita Swetha: హ్యాట్+క్యూట్ ఫొటోల్లో నందితా శ్వేత.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న బ్యూటీ
Official note from @peoplemediafcy#TheRajaSaab Jan 9th 2026 pic.twitter.com/1RGf8iNVlt
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 4, 2025
ఇది కూడా చూడండి: Bandla Ganesh : ఓరెయ్ బండ్ల నీ నోటిదూల ఆపురా.. నువ్వో మెగా ఫ్యామిలీ కుక్క.. విజయ్ ఫ్యాన్స్ ఫైర్!
అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనుకున్న సమయానికే.. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని, దాని కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అయితే డిసెంబర్ 25లోగా అన్ని పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా డిసెంబర్‌లోనే పెద్ద ఎత్తున అమెరికాలో జరపనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఎక్కడ కూడా రాజీ పడకుండా విశ్వప్రసాద్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మారుతి కూడా ప్రతీ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టి సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారని నిర్మాణ సంస్థ ఓ నోట్‌ను విడుదల చేసింది.
Follow Us