Baahubali The Epic - Coolie: 'కూలీ'తో కలిసి వస్తోన్న 'బాహుబలి'.. థియేటర్లు బ్లాస్ట్ పక్కా..!

రాజమౌళి "బాహుబలి: ది ఎపిక్" పేరుతో బాహుబలి సినిమాను కొత్తగా రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అదనపు సన్నివేశాలు, లాంగ్ రన్‌టైమ్ తో ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే టీజర్‌ను ఆగస్ట్ 14న వార్ 2, కూలీ సినిమాల ఇంటర్వెల్‌లో థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

New Update
Baahubali The Epic Teaser

Baahubali The Epic Teaser

Baahubali The Epic - Coolie: ఇది మామూలు ప్లానింగ్ కాదుగా.. తెలుగు సినిమా ప్రేమికులకు మరోసారి ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాడు ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందిన దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి(SS Rajamouli). హీరో మహేష్ బాబు(Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా SSMB29 కి సంబంధించిన ప్రీ-లుక్‌ను విడుదల చేసి భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. మహేష్ బాబు పేస్ రివీల్ చేయకుండానే మెడలోని రుద్రాక్ష లుక్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన రాజమౌళి, నవంబర్ 2025లో పూర్తి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

అయితే ఇప్పుడు మరో భారీ ట్రీట్ ప్రభాస్ అభిమానులకు కూడా ఇవ్వనున్నాడు రాజమౌళి. "బాహుబలి" సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే, కొత్తగా "బాహుబలి: ది ఎపిక్" పేరుతో విడుదల చేయనున్నారు. ఈ వెర్షన్‌లో అదనంగా కొన్ని సన్నివేశాలు కూడా యాడ్ చేస్తున్నారట, లాంగ్ రన్‌టైమ్, అలాగే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కొన్ని అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Also Read: తలైవా ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. ‘కూలీ’ మూవీ టికెట్ బుకింగ్స్ స్టార్ట్..

థియేటర్లు బ్లాస్ట్ పక్కా..! 

తాజా సమాచారం ప్రకారం, "బాహుబలి: ది ఎపిక్" టీజర్‌ను(Baahubali The Epic Teaser) ఆగస్ట్ 14, 2025 విడుదలవుతున్న భారీ సినిమాలు వార్ 2(War 2), కూలీ(Coolie Movie) సినిమాలతో పాటుగా ఇంటర్వెల్ సమయంలో థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినా ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టీజర్ గురించి ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే "బాహుబలి: ది ఎపిక్" సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్, రానా దాగుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్ కాస్టింగ్‌తో మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్న ఈ ఎపిక్ వెర్షన్, ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని ఇవ్వబోతోంది. ఇందులోని విజువల్స్, నేపథ్య సంగీతం, ఇంకా అడ్వాన్స్ సాంకేతికతతో  సినిమాని మరింత క్వాలిటీగా మన ముందుకు తీసుకురానున్నారట.

Also Read: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం‌పై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!

ఈ సినిమా అక్టోబర్ 31, 2025న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. SSMB29 ఫస్ట్ లుక్, బాహుబలి టీజర్, ఈ రెండు అప్డేట్లతో రాజమౌళి అటు మహేష్ అభిమానులకి ఇటు ప్రభాస్ అభిమానులకి  అదిరిపోయే కిక్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఇక ఫ్యాన్స్ అయితే ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్న బాహుబలి: ది ఎపిక్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి మరోసారి తన సినిమా స్టామినా ఏంటో అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' రీ  రిలీజ్ తో నిరూపించుకోనున్నాడు. SSMB29, బాహుబలి: ది ఎపిక్ కోసం అభిమానులే కాదు, మొత్తం ఇండస్ట్రీ వెయిట్ చేస్తోంది. అయితే అధికారిక ప్రకటనలు వచ్చేంత వరకూ ఈ హైప్ తగ్గేలా కనిపించటం లేదు. ఈ రెండు సినిమాలతో జక్కన ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. 

Advertisment
తాజా కథనాలు