/rtv/media/media_files/2025/08/08/coolie-advance-booking-2025-08-08-18-37-33.jpg)
Coolie Advance Booking
Coolie Advance Booking: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’(Coolie Movie) పైదేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే, తమిళనాడులో ఈరోజు (ఆగస్టు 8, 2025) రాత్రి 8 గంటల నుంచి ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఒక వీడియోని ట్విట్టర్ X లో పోస్ట్ చేసింది. దీంతో రజనీ అభిమానుల హడావిడి మొదలయిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే "#CoolieAdvanceBooking" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
The time has come! #Coolie bookings open across TN Today, 8 PM onwards! 😎🍿#Coolie releasing worldwide August 14th @rajinikanth@Dir_Lokesh@anirudhofficial#AamirKhan@iamnagarjuna@nimmaupendra#SathyaRaj#SoubinShahir@shrutihaasan@hegdepooja@anbariv@girishganges… pic.twitter.com/DlU1i0aiT3
— Sun Pictures (@sunpictures) August 8, 2025
అభిమానుల సందడే సందడి..!
‘కూలీ’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇది రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. ట్రైలర్, ఫస్ట్ లుక్, మ్యూజిక్ అన్నిటికీ ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన రజనీకాంత్ లుక్ కూడా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది.
ఆగస్టు 8వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ బుకింగ్స్‌కి ఇప్పటికే తమిళనాడులోని థియేటర్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని ప్రీమియం థియేటర్స్ లో మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ స్పెషల్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టికెట్ బుకింగ్ సైట్లు కూడా ప్రత్యేకంగా ‘కూలీ’కి హోమ్ పేజీలను డిజైన్ చేస్తున్నాయి.
Also Read: ‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!
విడుదలకి ముందే రికార్డుల మోత..!
ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే బుకింగ్స్ అన్ని హౌస్‌ఫుల్ కనిపించే అవకాశం ఉంది. రజనీ సినిమా అంటే స్కూళ్ళకి, ఆఫీసులకి సెలవ పెట్టి మరీ మూవీ మూడ్ లోకి వెళ్లే తమిళ అభిమానులు కూలీ కోసం ఈసారి మరింత సందడి చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల కోసం ఈరోజు నుండే టిక్కెట్లని బుక్ చేసుకునేలా ప్లాన్ చేశారు మేకర్స్.
ఈసారి ‘కూలీ’ రిలీజ్‌ను ఒక పెద్ద పండుగలా మార్చేందుకు రజనీ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఫ్యాన్స్ షోలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, డాన్సులు, పూలవర్షాలు అన్నిటితో మళ్లీ థియేటర్ల వద్ద ఓ పండగ వాతావరణం కనిపించనుంది.
Also Read:'బాషా'ని మించేలా 'కూలీ' ఇంటర్వెల్.. గూస్‌బంప్స్ పక్కా!
Coolie Advance Bookings Open From:
ఆగస్టు 8, 2025, 8:00 గంటల నుండి తమిళనాడులోని అన్ని మెజర్ థియేటర్లలో..