Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్కులో పాల్గొనడం కనిపించింది. కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికైన ఇమ్మాన్యుయేల్, తనూజ, దివ్య, నిఖిల్, పవన్ కళ్యాణ్ ఈ టాస్కులో పోటీపడ్డారు. దీనికోసం బిగ్ బాస్ పోటీదారులకు హ్యాట్ తో వేట అనే టాస్క్ ఇచ్చారు. సర్కిల్ ఉన్న హ్యాట్ ను ఎవరు ముందుగా పట్టుకుంటే.. వారికి ఒక కంటెండర్ ను రేసులో నుంచి తొలగించే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్కులో ఎప్పటిలాగే మన ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోయాడు. అందరి కంటే ఎక్కువ సార్లు హ్యాట్ పట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని రేసులో నుంచి ఔట్ చేశాడు. చివరిగా ఇమ్మూ, తనూజ మధ్య పోటీ జరగగా.. బిగ్ బాస్ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
కుప్పకూలిన తనూజ
ప్రోమో చివరిలో తనూజ ఒక్కసారిగా కిందపడిపోవడం అందరినీ టెన్షన్ కి గురిచేసింది. ఇమ్మాన్యుయేల్, దివ్య, సుమన్ శెట్టి ఎంత పిలిచినా ఆమె కళ్ళు తెరవలేదు. మరి తనూజ కళ్ళు తిరిగి పడిపోయిందా లేదా టాస్కులో ఏదైనా గాయమైందా అనేది తెలియదు.
Also Read: Rakul: రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ.. రకుల్ ఫొటోలు చూస్తే ఫ్లాట్!
Follow Us