/rtv/media/media_files/2025/04/14/ydJuTDhKdaVx7BI3vclw.jpg)
Daaku Maharaaj
Daaku Maharaaj: బాలయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా హవా చూపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం తాజాగా అరబ్ దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: జైలర్ 2 షూటింగ్ లీక్ చేసిన రమ్య కృష్ణ
రాబిన్ హుడ్ స్టైల్‌లో బాలయ్య..
ఇరాక్‌లోని ఒక ప్రముఖ అరబిక్ న్యూస్‌పేపర్ ఈ సినిమాపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో చిత్రానికి సంబంధించిన సాంకేతికత, యాక్షన్ సన్నివేశాలు, కథా నిర్మాణం. ‘డాకు మహారాజ్’లో బాలకృష్ణ పోషించిన పాత్రను రాబిన్ హుడ్ స్టైల్‌లో ఉందంటూ పోలుస్తూ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది.
Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్
తెలుగు సినిమా గురించి అరబిక్ మీడియా కవరేజ్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. ఇప్పుడు బాలయ్య అభిమానులు ఈ విషయం పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎక్స్ వేదికగా ఈ ఆర్టికల్‌కు సంబంధించిన ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు తెగ ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.
బాబీ (K.S. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, బాబీదేవోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందింది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన దగ్గర నుంచి వీవర్స్ చార్ట్ లో టాప్ పొజిషన్లలో నిలుస్తూ, బాలయ్య మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తోంది.