/rtv/media/media_files/2024/11/24/reXj9vpEsH8VFCBxtOz0.jpg)
AR Rahman
AR Rahman: ఆస్కార్ విజేత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను పరస్పర అంగీకారంతో ఇటీవలే విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్ళైన 15 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోవడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏఆర్ రెహ్మాన్ మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని.. అందుకే భార్యకు విడాకులు ఇచ్చారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్తతో విడిపోయిన తర్వాత సైరా భాను రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఈ ప్రకటనలో సైరా భాను రెహమాన్‌పై తన ప్రేమను వ్యక్తం చేసింది. వాస్తవం లేని వార్తలతో అతనిని, అతని కుటుంబాన్నిబాధపెట్టడం మానుకోవాలని మీడియాను కోరింది.
Also Read: Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్
రెహమాన్ చాలా మంచి వ్యక్తి
సైరా తన ప్రకటనలో ఇలా పేర్కొంది.. ''ఏఆర్ రెహమాన్ చాలా మంచి వ్యక్తి.. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొంతమంది దారుణంగా కామెంట్లు, వార్తలు రాస్తున్నారు. దయచేసి రెహ్మాన్ గురించి తప్పుగా ప్రచారం చేయొద్దు. నా జీవితంలో నేను ఆయనను చాలా విశ్వసిస్తాను. ఇప్పటికీ ఆయనంటే చాలా ఇష్టమని నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఈ నిర్ణయం 100% పరస్పర అంగీకారంతో జరిగింది. ఊహాగానాలు మానేయమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని తెలిపారు. అలాగే తన ఆరోగ్యం తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడింది. కొన్ని రోజులుగా ముంబైలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. గత కొంతకాలంగా నా భర్తకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నానని సైరా భాను తెలిపారు''. దీంతో విడాకుల విషయంలో రెహ్మాన్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశారు సైరా.
Also Read: ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ పుకార్ల పై ఏఆర్ రెహమాన్ లీగల్ టీమ్ సీరియస్ అయ్యింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేసింది.
Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు
Also Read: Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..!