వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆర్జీవీకి కోర్టులో చుక్కెదురు అయింది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. రేపటికి వాయిదా వేసింది. దీంతో నవంబర్ 27న ఆర్జీవీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read: ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు
ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపు
ఇదిలా ఉంటే మరోవైపు ఆర్జీవీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు బృందాలుగా ఏపీ పోలీసులు ముమ్మరంగా సెర్చింగ్ చేస్తున్నారు. దాదాపు రెండు రోజులు కావస్తున్నా.. ఆర్జీవీ ఎక్కడా కనిపించకపోవడం లేదు. దీంతో ఆయన తెలుగు స్టేట్స్ లోనే ఉన్నాడా? లేక మరెక్కడికైనా వెళ్లిపోయాడా? అసలు ఎక్కడున్నాడు? అని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..!
కేసు ఏంటి?
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని.. అలాగే ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైంలో వారిపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. టీడీపీ నేత రామలింగం మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో RGV పై PS 7 సెక్షన్ ల క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇటీవల విచారణకు రావాలని RGV కి నోటీసులు కూడా అందించారు.
Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
తొలుత ఈ కేసులో కీలక అంశాలపై విచారించేందుకు విచారణకు నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. ఈ క్రమంలో అర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తు షెడ్యుల్ కారణంగా రాలేనని CI కి వాట్సాప్ ద్వారా.. తన తరపున అడ్వకేట్ ద్వారా తెలియజేశారు. తనకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే RGV విన్నపం మేరకు పోలీసులు ఈ నెల 25న అంటే నిన్న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
Also Read: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!
కానీ నిన్న కూడా విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఆర్జీవి ఇంటికి నేరుగా వెళ్లారు. కానీ అక్కడ ఆయన లేరు. దీంతో ఆర్జీవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.