Ghaati Movie: అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న 'ఘాటి' జులై 11న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో ''సైలోరె'' పాటను విడుదల చేశారు. హీరో హీరోయిన్లు అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభుల పెళ్లి నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఇందులో వారిద్దరూ పెళ్ళైన కొత్త జంటగా కనిపిస్తారు. గిరిజన సంప్రదాయం నేపథ్యంలో, అందమైన సెట్టింగ్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఫోక్ స్టైల్ లిరిక్స్, డప్పుల శబ్దాలు, ఉత్సాహభరితమైన సంగీతం ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Chant #Sailore in celebration and dance to the folk beats 💥💥#Ghaati First Single #Sailore out now ❤🔥
— Anushka Shetty (@MsAnushkaShetty) June 21, 2025
▶️ https://t.co/CZ2NqNV1qG
A @NagavelliV Musical Debut 🎼#Ghaati GRAND RELEASE WORLDWIDE ON JULY 11th.#GhaatiFromJuly11th
⭐ing @iamVikramPrabhu
🎥 Directed by the…
రెండవ చిత్రం
దర్శకుడు క్రిష్ జగర్లమూడి స్వయంగా ఈ పాట లిరిక్స్ రాశారు. సాగర్ నాగవల్లి మ్యూజిక్ అందించగా.. లిప్సికా భాష్యం, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ "సైలోర్" పాట సినిమాలోని ప్రేమకథకు ఇంట్రోలా కనిపించింది. 'వేదం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చాలా సీరియస్ గా, ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కనిపించి అంచనాలను పెంచేసింది.
'ఘాటి' లో అనుష్క గంజాయి స్మగ్లింగ్ రాణిగా కనిపించనుంది. ఒకప్పుడు అమాయకురాలైన మహిళలను అనుకోని పరిస్థితులు, చేదు అనుభవాల ఎలా ఒక క్రూరమైన నేర ప్రపంచానికి నాయకురాలిగా మార్చాయి అనేది ఈ సినిమా కథాంశం.