Ghaati Movie: మొదలు కానీ 'ఘాటీ' ప్రమోషన్స్! విడుదల వాయిదా?

అనుష్క శెట్టి 'ఘాటి' విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఎటువంటి ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీసం సినిమా ట్రైలర్, టీజర్ అప్డేట్స్ కూడా లేకపోవడం అనుష్క అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ మూవీ 11న థియేటర్లలో విడుదల కానుంది.

New Update

Ghaati Movie: 'వేదం' తర్వాత అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం 'ఘాటి'. ఈ మూవీ 11న థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదల  తేదీ దగ్గరపడుతున్నా.. ఎటువంటి ప్రమోషన్స్ సందడి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విడుదలకు మూడు వారాలే ఉన్నప్పటికీ .. చిత్రబృందం ఇంకా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టలేదు. కనీసం సినిమా ట్రైలర్, టీజర్ అప్డేట్స్ కూడా లేకపోవడం అనుష్క అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీంతో సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని నిర్ణయించగా.. జులై 11కి వాయిదా వేశారు. 

అదిరిపోయిన గ్లిమ్ప్స్ వీడియో

ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన 'ఘాటి' గ్లిమ్ప్స్ వీడియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో అనుష్క లుక్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అందించాయి. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఓ పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనిపించింది. 'ఘాటి' లో అనుష్క గంజాయి స్మగ్లింగ్ రాణిగా కనిపించనుంది. ఒకప్పుడు అమాయకురాలైన మహిళలను  అనుకోని పరిస్థితులు,  చేదు అనుభవాల ఎలా ఒక క్రూరమైన నేర ప్రపంచానికి నాయకురాలిగా మార్చాయి అనేది ఈ సినిమా కథాంశం. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తుండగా.. విక్రమ్ ప్రభు, ఆది పినిశెట్టి, రమ్యకృష్ణ, జగపతిబాబు, చైతన్య రావు మాదడి, రాఘవ్ రుద్ర ముల్పురు,  రవీంద్ర విజయ్, దేవికా ప్రియదర్శిని, లారిస్సా బోనేసి, విటివి గణేష్, జ్వాలా కోటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

'ఘాటీ' తర్వాత అనుష్క మలయాళంలో 'కత్తనార్: ది వైల్డ్ సోర్సరర్' అనే సినిమా చేయనుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది.  మొదటి భాగం 2025లో విడుదల కానుండగా.. పార్ట్ 2 2026లో వస్తుంది. 

Also Read: Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు