Anchor ravi: నంది స్కిట్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన యాంకర్ రవి!

హిందూ దేవుళ్లను కించపరిచినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న యాంకర్ రవి స్పందించాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఓ సినిమా సీన్‌ మేము సరదాకోసం చేశాం. ఇంకోసారి అలాంటి వీడియోలు చేయను. జై శ్రీరామ్' అంటూ వీడియో రిలీజ్ చేశాడు.

New Update
anchor ravi and sudhir

Anchor Ravi responds Hindu Gods controversy

Anchor ravi:హిందూ దేవుళ్లను కించపరిచినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న యాంకర్ రవి స్పందించాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఓ సినిమా సీన్‌ మేము సరదాకోసం చేశాం. ఇంకోసారి అలాంటి వీడియోలు చేయను. జై శ్రీరామ్' అంటూ వీడియో రిలీజ్ చేశాడు. కానీ రవి క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 హిందూ దేవుళ్లను ఎగతాళి..

అసలేం జరిగిందంటే.. ఇటీవల సుడిగాలి సుధీర్, రవి ఓ బుల్లితెర ప్రోగ్రామ్ కోసం చేసిన స్కిట్ వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ స్కిట్ పోస్ట్ చేసిన హిందూ సంఘాలు సుడిగాలి సుధీర్ తో పాటు యాంకర్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను ఎగతాళి చేసి, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వీళ్లకి పరిపాటి అయిపోయిందని మండిపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి స్క్రిప్టులు రాయకుండా, చేయకుండా వీళ్లకి తగిన గుణపాఠం నేర్పాలంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో మొదట క్షమాపణలు చెప్పనని యాంకర్ రవి తేల్చి చెప్పాడు. ఛానల్ ఓనర్లకు ఫోన్ చేసి చెప్పుకోమని యాంకర్ రవి అన్నాడు. కానీ తాజాగా దిగొచ్చిన రవి.. ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయనని తేల్చిచెప్పాడు. 

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్లకు ఏం జరుగుతుందో, మీకూ అదే జరుగుతుందంటూ కేశవ రెడ్డి రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రవితో కేశవ రెడ్డి ఆడియో బైట్ వైరల్ అవుతుంది. యాంకర్‌ రవిని కేశవరెడ్డి తీవ్రంగా హెచ్చరించాడు.

Also Read: ‘సోదరా’ ట్రైలర్‌ చూశారా..? సంపూ రచ్చ మాములుగా లేదుగా!

 sudigali-sudheer | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు