/rtv/media/media_files/2025/04/11/M1eClsw6enpo8SMdIXuo.jpg)
Sampoornesh Sodara
Sampoornesh Sodara : టాలీవుడ్ లో యాక్షన్, కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో నవ్వించే సంపూర్ణేశ్‌బాబు మరోసారి తన కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపూర్ణేశ్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సోదరా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆయనతో పాటు సంజోశ్ అన్నదమ్ములుగా నటించారు. కథలో అన్నదమ్ముల మధ్య సంబంధం, పెళ్లి నేపథ్యంలో వచ్చే భావోద్వేగాలు ప్రధానంగా చూపనున్నారు.
Also Read: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
ఈ సినిమాకు మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించగా, హీరోయిన్లుగా ఆర్తి, ప్రాచి బన్సాల్ నటిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చంద్ర చగన్ల ఈ సినిమాను నిర్మించారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
‘సోదరా’ ట్రైలర్ లాంచ్
తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను(Sodara Trailer) విడుదల చేసింది. డైరెక్టర్ బేబీ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే, పెద్ద కొడుకు పెళ్లికి తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లను, అన్నదమ్ముల మధ్య జరిగే పరిణామాలను హాస్యంతో మేళవించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Also Read: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది, ఏప్రిల్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి సంగీతాన్ని సునీల్ కశ్యప్ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలు శివ సర్వాణి నిర్వహించారు. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భావోద్వేగాలకు తావిచ్చే ఈ చిత్రం, సమకాలీన కుటుంబ నేపథ్యానితో వినోదాత్మకంగా ఉండబోతుందని మూవీ టీమ్ తెలిపింది.