'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి

అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్‌ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు. రచ్చ గెలిచి ఇంట గెలిచానన్నారు.

author-image
By B Aravind
New Update
Chiru 2

 హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20న నాగార్జున చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవీ మాట్లాడుతూ.. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్‌ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చెప్పారు. 

Also Read: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

మా నాన్న నన్ను ఎప్పుడూ పొగడలేదు

'' సాధారణగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు.. కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచాను. నా సినీ జీవితంలో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత క్రేజ్ వచ్చినా ఏనాడు కూడా ఇంట్లో మా నాన్న పొగిడేవాడు కాదు. ఈ విషయంలో మదనపడేవాడిని. ఈ విషయాన్ని అమ్మకి చెప్పాను. పిల్లలను తల్లిదండ్రులు పొగడటం ఆయుఃక్షీణం అందుకే మీ నాన్న అలా పొగడరని, అస్తమానం నీ గురించే చెబుతుంటారు అని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది నేను ఇంట.. రచ్చ కూడా గెలిచానని.  

ఆ అవార్డు తీసుకోలేదు

తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో నాకు లెజెండరీ అవార్డు వచ్చింది. నాకు అది ఇవ్వడం కొందరికి నచ్చలేదు. ఈ విషయం నాకు తెలిసి.. ఆ రోజు ఆ అవార్డును తీసుకోలేదు. దాన్ని దాచి ఏ రోజైతే నాకు ఆ అర్హత వస్తుందని అందరూ భావిస్తారో అప్పుడే తీసుకుంటానని చెప్పా. ఇప్పుడు నాకు ఆ అర్హత వచ్చింది. ఎందుకంటే లెజండరీ ఏఎన్‌ఆర్ నేషనల్ అవార్డు నాకు రావడం.. ఇది కూడా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్నాను. ఇది కదా అవార్డు అంటే.. నేను రచ్చ గెలిచాను, ఇంట కూడా గెలిచానని'' చిరంజీవి చెప్పారు. 

Also Read: సల్మాన్‌కు దూరంగా ఉండకపోతే చస్తావ్..ఎంపీకి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్!

తెలుగు సినిమాలో భాగమవ్వడం తన అదృష్టమని.. టాలీవుడ్‌లో తాను కూడా ఒక సభ్యుడిని కావడం గర్వకారణమని అమితాబ్ బచ్చన్ అన్నారు. మరోవైపు ఈ వేడుకలో అక్కినేని నాగార్జున కూడా మాట్లాడుతూ.. ఎంతస్థాయి, ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా చిరంజీవి ఎప్పుడూ కూడా సింపుల్‌గానే ఉంటారని అన్నారు. అదే ఆయన్ని మెగాస్టార్‌ను చేసిందని కొనియాడారు. ఇక ఈ కార్య్రక్రమానికి రామ్ చరణ్, బ్రహ్మానందం, నానీ, సిద్ధు జొన్నల గడ్డ, శ్రీలీల తదితర నటీ నటులు హాజరయ్యారు. 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు