చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం నెలకొనడంతో 2023లో 14,808 కిండర్‌ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అలాగే 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ప్రభావం విద్యతో పాటు వివిధ రంగాలపై పడటం ఆందోళన కలిగిస్తోంది. జననాల రేటు తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. 2023లో చూసుకుంటే చైనావ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా రిపోర్టు వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే ఏకంగా 11 శాతం తగ్గింది. అందువల్లే ఇలా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.   

Also Read: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!

మరోవైపు ప్రాథమిక పాఠశాలలపై కూడా ఈ ప్రభావం పడింది. 2023లో ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయింది. దీంతో దాని జనాభా 140 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జననాల సంఖ్య 20 లక్షల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 2023లో 90 లక్షల జననాలు మాత్రమే జరిగాయి. అయితే 1949 నుంచి ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

Also Read: ఖమేనీ ఎక్స్ అకౌంట్ సస్పెండ్.. వార్నింగ్ ఇవ్వడమే కారణమా?

జనాభా పరంగా చైనా ప్రస్తుతం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జనానాలు, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోతుంటే మరోవైపు వృద్ధుల జనాభా కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2023 నాటికి చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంది. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకుంటుందని.. 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని తాజాగా ఓ నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మూతపడ్డ కిండర్‌గార్డెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. అంతేకాదు ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షులుగా విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు