Amaran: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమరన్.. ఎప్పుడంటే ?

వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

New Update
Amaran

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read: ఎన్నికల ఫలితాలపై మీ అనుమానాలు వింటాం.. కాంగ్రెస్‌కు ఈసీ పిలుపు

Amaran Movie On OTT

ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీపావళి కానుకగా తమిళ్, తెలుగు, మళయాలం భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ బ్యానర్‌పై కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తగా నిర్మించారు. 

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటి వరకు ఒక మంచి హిట్ కోసం ఎదురుచూసిన శివ కార్తికేయకు ఈ సినిమా అదిరిపోయే హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో ముఖ్యంగా లవ్, ఎమోషన్ ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. దానికి తోడు సాంగ్స్ అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి. 

Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

ఇలా స్టోరీ, సాంగ్స్‌తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికి వరల్డ్ వైడ్‌గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా హిట్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అమరన్ సినిమాను డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషలలోను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది.

Also Read :  దేశానికే అవమానం.. బంగ్లాదేశ్ విద్యార్థులు ఇండియా జాతీయ జెండాపై..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు