BIG BREAKING: మెగా, అల్లు ఫ్యామిలీల్లో విషాదం!

మెగా, అల్లు ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ అమ్మ, దివంగత అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు. వృధాప్య కారణంగా అర్థరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు.

New Update
Allu Arjun Grand mother

Allu Arjun Grand mother

మెగా, అల్లు ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ అమ్మ, దివంగత అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు. వృధాప్య కారణంగా అర్థరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే రామ్‌చరణ్ మైసూర్ నుంచి , బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అంత్యక్రియలకు అరవింద్, చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. నేడు జనసేన బహిరంగ సభ వైజాగ్‌లో ఉంది.

ఇది కూడా చూడండి: Pragya Jaiswal: స్లీవ్ లెస్ టాప్ లో ప్రగ్య అందాల జాతర.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!

అనారోగ్య సమస్యల కారణంగా..

ఈ క్రమంలో పవన్, నాగబాబులు వైజాగ్ ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేసే అవకాశం ఉంది. అయితే కనకరత్నమ్మ అల్లు అర్జున్‌కు నానమ్మ కాగా.. రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అవుతుంది. కనకరత్నమ్మ మరణవార్త తెలిసిన తర్వాత బంధు మిత్రులు, సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కనకరత్నమ్మ గత కొంత కాలం నుంచి వయో భారంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో కూడా చేర్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: RajaSaab Release Date: ఇదేం ట్విస్ట్ 'రాజా సాబ్'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా.. !

Advertisment
తాజా కథనాలు