Allu Arjun: 'పుష్ప2' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతా మారుమోగింది. భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే
అక్టోబర్ లో షూటింగ్
ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈమూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. అలాగే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలిపారు. పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
"#AlluArjun - #Trivikram సినిమా ఈ సంవత్సరం అక్టోబర్ నుండి ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం..
— Movies4u Official (@Movies4u_Officl) April 1, 2025
Complete Mythology.. Not Socio Fantasy."
- #NagaVamsipic.twitter.com/G7mGlOZRIU
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
జీబ్లీ ఇమేజ్ లు
దీంతో బన్నీ లుక్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడే సోషల్ మీడియాలో కుమారస్వామిగా అల్లు అర్జున్ జీబ్లీ ఇమేజ్ లు క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి #AA22 అనే పాన్ ఇండియా మూవీ లైన్లో పెట్టారు బన్నీ. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
latest-news | cinema-news | allu-arjun
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!