Allu Arjun: చిరంజీవిపై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్... షాక్‌లో పవన్ ఫాన్స్!

మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. 'మావయ్య చిరు నాకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది' అని 'వేవ్స్' కార్యక్రమంలో చెప్పాడు. దీంతో చిరు, అల్లు ఫ్యాన్స్ షాక్ అవుతుండగా పవన్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

New Update
ALLU ARJUN

Allu Arjun sensational comments on Chiranjeevi

Allu arjun: మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. 'మావయ్య చిరు నాకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది' అని 'వేవ్స్' కార్యక్రమంలో చెప్పాడు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అలాగే తన ఫిటెనెస్ సీక్రెట్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు బన్నీ. మానసిక ప్రశాంతతే తన ఫిట్ నెస్ కు కారణమని చెప్పాడు. నటుడిగా తన జర్నీలో ఎన్నో సవాళ్లను అధిగమించానని, చిన్నతనం నుంచే తనకు డాన్స్ అంటే ఇష్టమని చెప్పాడు. 

సినిమాలే నా ప్రపంచం..

ఈ మేరకు బన్నీ మాట్లాడుతూ.. 'సినిమాలే నా ప్రపంచం. అది తప్ప మరో ఆలోచన లేదు. ఎంతోమంది నాపై చూపించిన అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మా అంకుల్‌ చిరంజీవి నాకు ఎంతో స్ఫూర్తి. నాపై ఆయన ప్రభావం ఉంది. ‘#AA22’ కోసం దర్శకుడు అట్లీ చెప్పిన ఐడియా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.  విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది' అని చెప్పాడు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

ఇక ముంబైలో గురువారం ప్రారంభమైన 'వేవ్స్' కార్యక్రమం మే 4 వరకు జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు రాజమౌళి..‘భారత దేశంలో చాలా భాషలున్నాయి. ఒక్కో దానికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. ఎన్నో కళలున్నాయి. లెక్కలేనన్ని కథలున్నాయి. కథల విషయంలో ఏ దేశం భారత్ కు సాటి రాదు. యూఎస్‌ఏ, సౌత్‌ కొరియా, చైనా తదితర దేశాలతో మనం సమానంగా లేము. మన శక్తిపై నాకెలాంటి సందేహం లేదు. కానీ, మనకు ఓ గొప్ప వేదిక అవసరం. అలాంటిదే ఈ ‘వేవ్స్‌’' అని చెప్పాడు. 

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

 telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు