Pushpa 2: బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?

హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.205 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం మూడో రోజే రూ.74 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.

New Update
allu arjun (1)02

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిరోజే వరల్డ్ వైడ్ రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నార్త్ లో దుమ్ముదులుపుతోంది. హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే సినిమాకు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. డిసెంబర్ 05 న రిలీజైన ఈ సినిమా మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టగా.. తాజాగా మూడో రోజు ఏకంగా రూ.74 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. డే వన్ తో పోల్చుకుంటే మూడో రోజు కలెక్షన్స్ మరింత పెరగడం విశేషం.

దీంతో హిందీలో మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.205 కోట్లు రాబ‌ట్టిన తొలి తెలుగు చిత్రంగా 'పుష్ప2' నిలిచింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ కు నార్త్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రెండు రోజుల్లో 500 కోట్లు..

పుష్ప2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 449 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల మార్క్ ను చేరుకున్న భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు.  

Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?

Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య కొట్లాట.. స్పందించిన మంచు ఫ్యామిలీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు