దేశ వ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5 న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస
పది లక్షల టికెట్లు..
అదికూడా బుక్ మై షో లాంటి ఆన్ లైన్ టికెటింగ్ యాప్ లో కావడం విశేషం. 'పుష్ప2'.. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. కేవలం బుక్ మై షో లోనే వన్ మిలియన్ టికెట్స్ అంటే అక్షరాలా పది లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం.
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉందనంగా ఈ రేంజ్ లో టికెట్స్ సేల్ అయితే.. రిలీజ్ డే వరకు ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా ఇండియా వైడ్ గానే కాకూండా అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం ప్రీ సేల్ బుకింగ్స్‌లో హవా చూపుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల హిందీ వెర్షన్ టికెట్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. బాలీవుడ్‌లో ఆల్‌టైమ్ టాప్ చిత్రాల లిస్ట్‌లో ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ కౌంట్ ను బట్టి చూస్తే 'పుష్ప2' వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది.
Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్