/rtv/media/media_files/2025/03/22/xUm3108s5gT45JGgWKVp.jpg)
ALLU ARJUN- ATLEE
ALLU ARJUN: 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. ఈ సినిమా దక్షిణాదిలోనే కాకుండా హిందీ బెల్ట్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. 'పుష్ప' తో అల్లు అర్జున్ దేశంలోనే సెకండ్ హయ్యస్ట్ పేయిడ్ యాక్టర్ గా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ రెమ్యునరేషన్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
భారీ మొత్తం
అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం బన్నీ రూ. 175 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే లాభాల్లో 15%శాతం వాటా ఇచ్చేలా మూవీ నిర్మాణ సంస్ధ 'సన్ పిక్చర్స్' తో బ్యాకెండ్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ నుంచి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
#Atlee - #SunPictures - AlluArjun
— Movie Tamil (@MovieTamil4) March 22, 2025
- #AlluArjun has been offered a salary of 170 Cr for this film. There have also been talks of giving him 20% of the profits from the film after its release.
- Shooting August Month Started
- This film will be a heavy VFX film.#A6 pic.twitter.com/FCsDiNkLny
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప2 కోసం రూ. 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. గతేడాది విడుదలైన పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. భారతీయ సినిమాలో కొత్త రికార్డులను నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో అల్లు అర్జున్ర, ష్మిక మందన్న జంటగా నటించారు.
cinema-news | allu-arjun | allu-arjun-atlee-movie
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్