నా అరెస్ట్ కు కారణం అల్లు అర్జున్.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన జానీ మాస్టర్

జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు 'మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

New Update
jani master areest allu arjun

jani master areest allu arjun

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కు 'పుష్ప' సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బన్నీతో పాటూ జానీ మాస్టర్ కు కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. వీళ్లకి ఈ అవార్డ్ వచ్చిన తర్వాత వివాదాల్లో ఇరుక్కున్నారు. మొదట జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చాడు. 

ఇటు అల్లు అర్జున్ సైతం సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే ఇష్యూ పై ఇటీవల ఓ రిపోర్టర్ జానీ మాస్టర్‌ను ప్రశ్నించారు. 'మీకు మరియు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు?' అని విలేఖరి అడగ్గా.. అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. 

Also Read:  సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్

ఇక తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు జానీ మాస్టర్కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ కు మళ్ళీ అదే ప్రశ్న ఎదురైంది.' మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగితే.. ఈసారి కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 

ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడా?

అయితే జానీ మాస్టర్ చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లినట్లు డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా అనుకోడానికి కూడా ఓ రీజన్ ఉంది. 'పుష్ప2' షూటింగ్ టైం లోనే జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే లేడీ  అసిస్టెంట్ తో తరచూ సెట్స్ కి వచ్చి గొడవలు పెట్టుకునేవాడని, ఆ గొడవల్ని అల్లు అర్జున్, సుకుమార్ సెటిల్ చేశారని కొన్ని రూమర్స్ ఉన్నాయి.

Also Read: మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫొటోలు

అందుకే అరెస్ట్ గురించి అడిగినప్పుడల్లా ఆయన ఏం చెప్పకుండా సైలెంట్ గా అక్కడినుంచి వెళ్లిపోతున్నాడంటే అది నిజమేనేమో అని కొందరి వాదన.  అసలు శ్రీతేజ్ ను పరామర్శించాల్సిన అవసరం జానీ మాస్టర్ కు లేదు. శ్రీతేజ్ గురించి ఇప్పటిదాకా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. 

అలాంటింది జానీ మాస్టర్ ఏకంగా హాస్పిటల్ కు వచ్చి మరీ బాలుడ్ని పరామర్శించాడు. ఎందుకంటే అది అల్లు అర్జున్ వల్ల జరిగింది కాబట్టి. దీన్ని హైలైట్ చేస్తూ బన్నీని బ్లేమ్ చేస్తూ ఇలా మీడియాలో హైలైట్ అవుతున్నాడని నెటిజన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు