Allu Arjun: మలయాళ సినిమాను మెచ్చిన బన్నీ.. పోస్ట్ వైరల్

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ 'మార్కో' చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ సినిమా టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ గారు దర్శకుడిని పిలిచి మొత్తం బృందాన్ని అభినందించారని పేర్కొంది.

New Update
unnimukundan marco

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ యంగ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత  'భాగమతి' చిత్రంలో అనుష్క ప్రేమికుడిగా మెప్పించారు. 

ఆయన హీరోగా నటించిన తాజా మలయాళ చిత్రం 'మార్కో' డిసెంబర్ 20న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, బాలీవుడ్ భాషల్లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. సినిమాలో తీవ్రమైన హింస, రక్తపాతం ఉందని కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుండి భారీ ఆదరణను అందుకుంది. 

Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు. ఈ సినిమా ఉన్ని ముకుందన్‌కు పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. 

Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!

నేషనల్ అవార్డు విజేత అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడితో పాటు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్సులు, ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్ని ముకుందన్ నటనపై మెచ్చుకున్నారు. ఆయన ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూసి, ఇందులో పాల్గొన్న ప్రతీ వ్యక్తిని అభినందించినట్లు మూవీ టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు