శిల్పారవికి థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. వైరల్ అవుతున్న ట్వీట్!

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్‌లో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు రెడీగా ఉన్నానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ట్వీట్ చేశారు. దానికి థ్యాంక్యూ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు.

New Update
Allu Arjun and  Silpa ravi

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన సిట్టింట్ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు తన స్నేహితుడు శిల్పారవికి ఓటేయాలని కోరురు. అక్కడితో మొదలైంది మెగా ఫ్యామిలీ వార్. 

Also Read :  చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో వెంటనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మనవాళ్లు బయటవాళ్లయ్యారు. బయటవాళ్లు మనవాళ్లయ్యారు’ అంటూ ఓ ట్వీట్ పెట్టారు. దీంతో మెగా ఫ్యామిలీలో దుమారం రేగింది. నాగబాబు పెట్టిన ట్వీట్‌కు బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వరుస కామెంట్లతో నాగబాబుకు చిరాకు తెప్పించారు. దీంతో నాగబాబు తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. 

Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్

కానీ ఆ గొడవ అక్కడితో ఆగలేదు. దాదాపు 2024 ఎలక్షన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీలో ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. తన ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఈ రచ్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. 

Also Read: 10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు

ఏదో ఒక ఈవెంట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఈ విషయాన్ని గెలుకుతూనే ఉన్నారు. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టా నుంచి బన్నీని అన్‌ఫాలో చేసాడు. ఆ తర్వాత ఇటీవల వరుణ్ తేజ్ సైతం పరోక్షంగా బన్నీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఎదో ఒక సమయంలో బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కానీ బన్నీ మాత్రం ఫస్ట్ నుంచి ఆఖరి వరకు ఒకే మాట మీద ఉన్నాడు. తనకు పార్టీలతో సంబంధం లేదని.. తన స్నేహితునికి మాట ఇచ్చానని.. దాని కారణంగానే అతడికి మద్దతు తెలిపానని చెప్తూ వచ్చాడు. 

Also Read : అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష!

ఇక బన్నీ ప్రస్తుతం ‘పుష్ప2’ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌ని షేక్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా బన్నీకి వచ్చిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. 

బన్నీ-శిల్పారవి ట్వీట్స్ వైరల్

అల్లు అర్జున్‌కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రారెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పుష్ప 2 మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని శిల్పారవి ట్వీట్ చేశాడు. ఈ మేరకు థియేటర్‌లో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు ఆగలేకపోతున్నానని తెలిపాడు. ఇందులో భాగంగా పుష్ప2 మూవీ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. అయితే శిల్పారవి చేసిన ట్వీట్‌కు బన్నీ రియాక్ట్ అయ్యాడు. థ్యాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు