Allu Aravind : అల్లు అరవింద్ ఎమోషనల్.. దండం పెడుతూ

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ సైతం మాట్లాడారు. మేము ఎలాంటి మనుషులం అనేది మీకు తెలుసు. అలాంటిది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ తో ఒకరు మాట్లాడుతుంటే బాధేసిందని అన్నారు.

New Update

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ సైతం మాట్లాడారు." ఆల్ ఇండియాలో కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాకి అతను వెళ్లి.. మొదటి షోలో కూర్చొని జనం తనను ఎలా రిసీవ్ చేసుకున్నారనే అదృష్టం ఇవ్వాళ లేకపోయింది. 

ఇంత పెద్ద సినిమా తీసిన అతను.. గత రెండు వారాలుగా ఓ మూలన కూర్చొని బాధ పడుతున్నాడు. దేశమంతా నీ సినిమాను సెలబ్రేట్ చేస్తుంటే నువ్వెంటి ఇలా అయిపోతున్నావని అడిగితే.. నావల్ల జరగకూడని తప్పు జరిగిపోయిందని బాధ పడ్డాడు. 22 ఏళ్ళు తాను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు.

Also Read :  అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్!

మూడు తరాలుగా చూస్తున్నారు.. 

అది ఒక్క సినిమా వల్లనో, ఒక ఇన్సిడెంట్ వల్లనో వచ్చింది కాదు. మీరు మూడు తరాలుగా చూస్తూ వస్తున్నారు. మేము ఎలాంటి మనుషులం అనేది మీకు తెలుసు. అలాంటిది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ తో ఒకరు మాట్లాడుతుంటే బాధేసింది. దయచేసి ప్రెస్ వాళ్ళు, ప్రజలు మీరంతా ఆదరించి.. ఆ అభిమానాన్ని అర్థం చేసుకొని ఇలానే కంటిన్యూ చేయమని కోరుతున్నా.." అని అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు