/rtv/media/media_files/2025/02/06/aRvPskThDOzCMNn1v1Gk.jpg)
Ajith Pattudala Photograph: (Ajith Pattudala)
అజిత్, త్రిష కాంబోలో రూపొందిన పట్టుదల సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగీజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ లవ్ స్టోరీ. లైకా ప్రొడక్షన్స్‌లో ఈ మూవీ తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యింది. అయితే తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా మంచి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టాడని ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పించేలా సీన్లు ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. అజిత్, త్రిషతో జరిగిన సన్నివేశాలు కూడా ఎంతో బాగున్నాయని అంటున్నారు.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
The positive review starts to pour... Clear Winner #VidaaMuyarchi
— Dharsha🇦🇺 (@DharshaTwits) February 5, 2025
BLOCKBUSTER REVIEW.....💥🤩🔥#VidaamuyarchiFDFS pic.twitter.com/qZy0gakp4n
ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు..
హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లు ఉన్నాయని.. హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ట్రైన్ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ ఉంది. ఈ సీన్ చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ పట్టుదల సినిమా అజిత్‌కి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చని నెటిజన్లు అంటున్నారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, అజిత్ యాక్టింగ్, యాక్షన్ సీన్లు అన్ని కూడా అదిరిపోయాయనే టాక్ వినిపిస్తోంది.
Clear Winner #VidaaMuyarchi
— NTR.YUVASENA (@Xntryuvasena) February 6, 2025
Ajith Sir 🔥🔥
What a Come back sir hope to Telugu version also be block buster
Love from Andhrapradesh #VidaamuyarchiFDFSpic.twitter.com/cCOitcEi4z
ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్ వాడితే.. చివరికి