Ajith GBU OTT Issue: అజిత్ సినిమాను డిలీట్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. కారణమేంటంటే..?

అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నుండి ఇళయరాజా పాటలు అనుమతి లేకుండా వాడినందుకు వివాదం రేగింది. మైత్రీ మూవీ మేకర్స్ అన్ని అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నా, కోర్టు తీర్పు కారణంగా సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుండి తొలగించారు.

New Update
Ajith GBU OTT Issue

Ajith GBU OTT Issue

Ajith GBU OTT Issue: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమా ఇటీవల ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌(Netflix) నుంచి తొలిగించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటంటే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఒక కీలక వివాదంలో చిక్కుకుంది.

ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా, ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తొలిసారిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలై, మంచి హిట్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ఆడింది. దాంతో పాటు మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్‌ కూడా చేశారు.

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

ఇళయరాజా(Ilayaraja) పాటలపై వివాదం

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ పాటలు మునుపటి చిత్రాలకు సంబంధించినవని, వాటిని రీమిక్స్ చేసి అనధికారికంగా వాడటం కాపీరైట్‌ హక్కులకు భంగం కలిగించిందని చెప్పారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించి, రూ. 5 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ వివాదం మద్రాస్ హైకోర్టు దాకా వెళ్లింది. విచారణ అనంతరం కోర్టు, ఇళయరాజా వాదనకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, పాటలను సినిమాలో నుంచి తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

నెట్‌ఫ్లిక్స్ స్పందన

కోర్టు ఆదేశాల మేరకు నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. వివాదాస్పద అంశాల కారణంగా "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రాన్ని తాత్కాలికంగా తమ ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించామని ప్రకటించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

చిత్ర నిర్మాత రవి మాట్లాడుతూ, తాము పాటల వాడకానికి సంబంధించిన అనుమతులను విడుదలకు ముందే తీసుకున్నామని, నిబంధనలు పాటించామని మీడియాకు తెలిపారు. అయినప్పటికీ, కోర్టు తీర్పును గౌరవిస్తూ పాటలు తొలగించాల్సి వచ్చింది.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. అజిత్‌ నటన, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాయి. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత, ఇళయరాజా వివాదం నేపథ్యంలో సినిమాను అర్ధాంతరంగా తొలిగించాల్సి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు