pushpa 2
Pushpa 2: బాలీవుడ్ లో 'పుష్ప2' మేనియా కొనసాగుతోంది. నార్త్ లో ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. తొలిరోజు రూ. 67 కోట్ల వసూళ్లతో అద్భుతమైన ఓపెనింగ్‌ను సాధించింది. ఒక టాలీవుడ్ డబ్బింగ్ సినిమా తొలిరోజే నార్త్ లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం. షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాకు మించిన అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకి కనిపించింది.
Non SSR/Shankar Top 2 Opening In North India @alluarjun🙏🔥#Pushpa pic.twitter.com/DOZLzOZLY4
— RJ (@Rohit_Julayi) December 18, 2021
హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా పుష్ప 2 రికార్డు
అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ రూ. 65.5 కోట్లతో హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టగా.. పుష్ప2 రూ. 67 కోట్లతో ఈ రికార్డును బ్రేక్ చేసింది. 'పుష్ప2' ఇప్పటి వరకు హిందీలో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అంతేకాదు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సౌత్ డబ్బింగ్ సినిమాగా కూడా నిలిచింది. గతంలో KGF చాప్టర్ 2 హిందీలో రూ. 52 కోట్లతో అతిపెద్ద సౌత్-డబ్బింగ్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 రూ. 67 కోట్లతో ఈ రికార్డును బద్దల కొట్టింది. పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు స్టేట్స్, నార్త్ లో ఈ సినిమా భారీ స్పందన పొందింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 95.1కోట్లు, హిందీలో రూ. 67 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి రూ. రూ. 13 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ లో తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు నిర్మాణసంస్థ తెలిపింది.
Also Read: తగ్గేదేలే.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్.. డే 1 కలెక్షన్స్ ఎంతంటే!