Aghori-Sri Varshini Issue: ఇవేం ట్విస్టులు రా సామీ.. అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు.. విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!

అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update

అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు సనాతన ధర్మం, మహిళ సమస్యలపై పోరాడుతానని చెప్పిన అఘోరీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీవర్షిణి ఫ్యామిలీ అఘోరీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవర్షిణి అన్న హర్ష అఘోరీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అఘోరీ తమ ఇంట్లో ఉన్నపుడు తనపై అసభ్యకరంగా ప్రవర్తించిందని తెలిపాడు. అంతేకాకుండా తనకు ముద్దులు పెడుతూ.. బుగ్గలు కొరికిందని అన్నాడు. 

15 రోజులు శ్రీవర్షిణి ఇంట్లో

ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతటికీ మూల కారణం విష్ణు అని తెలుస్తోంది. విష్ణు దాదాపు 13 ఏళ్లుగా శ్రీవర్షిణి ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన ఆఫీసు వద్ద అఘోరీ కారు రిపేర్ అవడంతో.. ఆమెను శ్రీవర్షిణీ ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం శ్రీవర్షిణీ ఫ్యామిలీకి అఘోరీని పరిచయం చేశాడు. అలా అఘోరీ దాదాపు 15 రోజులు శ్రీవర్షిణి ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

ఇప్పుడు అఘోరీతో శ్రీవర్షిణి వెళ్లిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై శ్రీవర్షిణీ అన్నగా చెప్పుకుంటున్న విష్ణు.. అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రీవర్షిణి పేరెంట్స్‌కు అఘోరీ డబ్బు ఆశచూపిందని అన్నాడు. ఖరీదైన వస్తువులు, మొబైల్‌ ఫోన్లు కొనిచ్చిందని తెలిపాడు.

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

అంతేకాకుండా శ్రీవర్షిణికి లక్ష రూపాయల కాలేజీ ఫీజు  చెల్లించిందంటూ అఘోరీపై ఆరోపణలు చేశాడు. అఘోరీ అకౌంట్‌లో రూ.10 లక్షలు నుంచి రూ.20 లక్షలు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని.. అన్ని అకౌంట్ ట్రాన్సక్షన్స్ తన వద్ద ఉన్నాయని అన్నాడు. 

Also Read :  రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి

రూ.1.50 ట్రాన్సక్షన్స్ చేసింది

తనకు రూ.1.50 ట్రాన్సక్షన్స్ చేసిందని తెలిపాడు. మంగళగిరిలోని BIGCలో రూ.1లక్ష విలువైన ఆరు ఫోన్లు అఘోరీ కొన్నాది అని సంచలన విషయాలు బయటపెట్టాడు. అలాగే తనకు ఉన్న రూ.45లక్షల విలువ గల ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చుకుంటానని ఆమెకు చెప్పినపుడు తానే రూ.50లక్షలు ఇస్తానని చెప్పిందని తెలిపాడు. అఘోరీ వద్ద ఉన్న డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయిందని సమాచారం. 

అయితే రూ.50లక్షలు ఇస్తానని అఘోరీ చెప్పి.. ఒక కండీషన్ పెట్టినట్లు తెలిసింది. ఆ డబ్బు తాను ఇస్తానని.. బదులుగా తనతో శ్రీవర్షిణీని పంపించమని అఘోరీ చెప్పడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే ఈ వ్యవహారం రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం పైనున్న వీడియో చూస్తే ఒళ్లు గగుళ్లు పొడిచే విషయాలు ఉన్నాయి.

(aghori news | aghori sri varshini | btech student sri varshini | lady aghori sri varshini relation | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు