Allu Arjun – Atlee: అల్లు అర్జున్- అట్లీ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా సంచలనం సృష్టించింది. అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నటీనటుల ఎంపిక కోసం వేట కొనసాగుతుండగా.. ఇందులో బన్నీ జోడిగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
Team #Atlee begins the hunt for leading ladies in #AA22!
— CHITRAMBHALARE (@chitrambhalareI) April 15, 2025
Script demands 3 heroines, and the search is on!#JanhviKapoor is locked — two more names to join the madness soon!#AA22xA6 #AlluArjun pic.twitter.com/ImT8I9pBcI
ముగ్గురు హీరోయిన్లు
ముగ్గురిలో ప్రధాన కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మిగతా ఇద్దరు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేకర్స్.. పాపులారిటీ కంటే డేట్స్ అందుబాటుల ఆధారంగా హీరోయిన్ల ఎంపిక చేసే ప్లాన్ లో ఉన్నారట. మరోవైపు సీనియర్ నటి త్రిష పేరు కూడా ప్రధాన కథానాయిక ఎంపికలో వినిపిస్తోంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు భారీ స్థాయిలో CG వర్క్ ఉండడంతో చిత్రం బృదం సరైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. CG వర్క్ అవసరాల దృష్ట్యా షూటింగ్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'పుష్ప' అల్లు అర్జున్ రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే తెలుగులో అట్లీ డైరెక్ట్ చేస్తున్న మొదటి చిత్రం కూడా కావడం మరో విశేషం.
telugu-news | latest-news | cinema-news | Allu Arjun – Atlee
Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!