Google: గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్ గూగుల్ సంస్థ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. By B Aravind 20 Dec 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గత కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్ భయాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్,ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం కొంతమంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగూల్ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. Also Read : KTR కుంభకోణం గురించి వారే చెప్పారు.. అసెంబ్లీలో రేవంత్ సంచలనం! Sundhar Pichai Announces Job Cuts ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. ముఖ్యంగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లాంటి కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై కూడా కోతలు ఉంటాయని సుందర్ పిచాయ్ చెప్పారు. ఓ గూగుల్ ప్రతినిధి దీనికి సంబంధించి పలు కీలక విషయాలు చెప్పారు. '' గూగుల్ సంస్థలో మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లాంటి కీలక స్థానాలు తగ్గించవచ్చు. లేదా మరికొందరు ఉద్యోగులను కూడా తీసివేసే ఛాన్స్ ఉంది. Also Read: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు.. ఒపెన్ ఏఐ లాంటి ప్రత్యర్థులతో గట్టి పోటీ ఉన్నందున ఉద్యోగుల్లో ఇలాంటి మార్పులు ఉండవచ్చని'' గూగుల్ ప్రతినిధి తెలిపారు. అయితే గతేడాది గూగుల్ ఆదాయంలో అత్యధికంగా 57 శాతం వాటా గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి వచ్చిందే. ప్రస్తుతం గూగుల్ కూడా AIలో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో జెమిని 2.0 లేటెస్ట్ ఏఐని కూడా ప్రారంభించింది. Also Read : కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్.. అప్పటివరకు నో అరెస్ట్! ప్రపంచ విషయాలను అర్థం చేసుకోవడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా గూగుల్ ఈ కొత్త ఏఐ మోడల్‌ని రూపొందించింది. అయితే 2022 సెప్టెంబర్ నుంచి గూగుల్‌లో లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. కంపనీ నిర్వహణ, కొత్త సాంకేతికతను స్వీకరించడం, ఇతర పోటీ కంపెనీలతో ఎదుర్కోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఏడాది(2023)సో గూగుల్ ఏకంగా 12 వేల మంది (6.4 శాతం) ఉద్యోగులను తొలగించింది. Also Read: పోతారు.. మొత్తం పోతారు..! దూసుకొస్తున్న భారీ గ్రహశకలం #telugu-news #sundar-pichai #lay-offs #google మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి