/rtv/media/media_files/2025/07/31/radhika-2025-07-31-19-40-21.jpg)
Radhika Sarathkumar: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రాధిక శరత్‌కుమార్ అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరం కారణంగా ఆమెను ఈ నెల 28న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట దీనిని సాధారణ జ్వరంగా భావించినప్పటికీ, వైద్య పరీక్షలో ఆమెకు డెంగ్యూ ఉందని తేలడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 5 వరకు ఆమెను వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
Also Read : Rohingyas: భారత్‌లో రోహింగ్యాలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Actress #RadikaaSarathkumar is down with Dengue and was admitted to a private hospital two days ago. Doctors have said that she will return home after undergoing treatment for another 5 days. pic.twitter.com/pXuRvTosq8
— Chennai Times (@ChennaiTimesTOI) July 31, 2025
త్వరగా కోలుకోవాలని
రాధిక శరత్‌కుమార్ ఆసుపత్రిలో చేరిన వార్త ఆమె అభిమానులలోనే కాకుండా చిత్ర పరిశ్రమలో కూడా అందరిని షాక్ కు గురిచేసింది. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాధికా శరత్‌కుమార్ కుమార్తె రాయనే మిథున్ తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. " అందరికీ ధన్యవాదాలు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. అమ్మకు డెంగ్యూ ఉన్నప్పటికీ, కోలుకుంటున్నారు. త్వరలో ఇంటికి తిరిగి వస్తారు. మీ ప్రేమ,ప్రార్థనలకు ధన్యవాదాలు" అని ఆమె పోస్ట్ చేశారు.
Also Read : OG First Single: పవర్ స్టార్ 'ఫైర్ స్ట్రామ్'.. OG ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోందోచ్!
కిజక్కే పోగమ్ రైల్ చిత్రంతో
1978లో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన 'కిజక్కే పోగమ్ రైల్' చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో రాధికాకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఆమె తమిళంలో అగ్ర తారల్లో ఒకరిగా ఎదిగారు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. తెలుగులో రాధికా శరత్‌కుమార్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. సినీ రంగంతో పాటు, ఆమె టెలివిజన్ సీరియల్స్‌లో కూడా ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, రాధిక దంపతులు ఇద్దరూ అధికారికంగా బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా రాధికా శరత్‌కుమార్ బీజేపీలోనే కొనసాగుతున్నారు.
Also Read : By-elections in Telangana : తెలంగాణలో బైపోల్..జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 స్థానాలకు..