Actress Kalpika: సిగరేట్లు అడిగితే ఇవ్వలేదు..రిసార్ట్ వివాదంపై కల్పిక!

సినీ నటి కల్పిక తరచూ ఏదో ఒక వివాదంపై వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్ లో స్టే చేయడానికి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం నెట్టింట చర్చనీయాంశమైంది.

New Update
kalpika

kalpika

సినీ నటి కల్పిక తరచూ ఏదో ఒక వివాదంపై వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్ లో స్టే చేయడానికి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం నెట్టింట చర్చనీయాంశమైంది.  సిగరెట్స్ కోసం నానా హంగామా సృష్టించింది. 'సిగరెట్స్ ఏవి రా'.. అంటూ రూమ్ కీస్, మెనూ కార్డు సిబ్బంది పై మొహం పై విసిరేసి బూతు పురాణం మొదలు పెట్టింది. ఈ విషయంపై రిసార్ట్ మేనేజర్ కృష్ణ సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేస్తూ మండిపడ్డారు.

Also Read :  జాన్వీ నయా ట్రెండ్.. పింక్ లెహంగాలో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ! పిక్స్ చూశారా

కల్పిక వివరణ

అయితే తాజాగా ఈ విషయంపై నటి కల్పిక స్పందించింది. తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ సిబ్బంది రూడ్ గా బిహేవ్ చేశారని చెప్పింది. అలాగే రిసార్ట్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ లేదా ర్యాపిడో బుక్ వైఫై కూడా లేదని తెలిపింది. వీటి గురించి ప్రశ్నిస్తేనే మేనేజర్ గొడవకు దిగాడని ఆరోపించింది. తాను ఎంత కూల్ గా చెప్పడానికి ప్రయత్నించినా.. యాజమాన్యం వినిపించుకోలేదని అందుకే గొడవకు దిగాల్సి వచ్చిందని తన వీడియోలో పేర్కొంది. 

Also Read :  బ్లూ డ్రెస్‌లో జిగేలుమంటున్న కింగ్‌డమ్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాములుగా లేదుగా!

నటి కల్పిక ఇలా రిసార్ట్, పబ్ సిబ్బందిపై గొడవకు దిగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా  గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ సిబ్బంది పై ఇలాగే గొడవకు దిగింది. పబ్ సిబ్బంది పై ప్లేట్లు విసిరేసి, బాడీ షేమింగ్ చేస్తూ నానా రచ్చ చేసింది. ఈ ఘటనకు సంబంధించి గతంలో ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం.. 324(4),352,351(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అయితే రీసెంట్ గా జరిగిన  తన బర్త్ డే పార్టీ కోసం ప్రిజమ్ పబ్ కి వెళ్ళింది. పార్టీ అంతా ముగిసిన తర్వాత చివరికి ఒక డిజర్ట్ విషయంలో పబ్ సిబ్బందితో గొడవకు దిగింది. 

కల్పిక టాలీవుడ్ లో పలు స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, జులై, పడిపడి లేచే మనసు, నమో వెంకటేష్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటు చిన్న సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలేమి లేవు. అందుకే సోషల్ మీడియాలో యాక్టీవ్ కనిపిస్తుంది. తరచూ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. 

Actress Kalpika | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates

Advertisment
తాజా కథనాలు