/rtv/media/media_files/2024/11/20/efNIuX6lshxVgkd1s2cS.jpg)
period mood swings
Life style: పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ ఉండడం అనేది ఒక సాధారణ సమస్య. హార్మోన్ల మార్పు వల్ల ఇలా జరుగుతుంది. ఇది మానసిక కల్లోలం, చిరాకు, కోపానికి దారితీస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ ని అధికమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
వ్యాయామం
నెలసరి సమయంలో చికాకు, కోపం లేకుండా సంతోషంగా, రిలాక్స్ గా ఉండాలంటే వ్యాయామం ఉత్తమ ఎంపిక. ఈ సమయంలో లైట్ యోగా, వాకింగ్, జాగింగ్ చేయాలి. ఇవి ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అలాగే పీరియడ్ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
సరైన నిద్ర..
సాధారణంగా పీరియడ్ సమయంలో శరీరానికి విశ్రాంతి ఎక్కువగా అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అలసట, చిరాకు వంటి మూడ్ స్వింగ్స్ కి దారితీస్తుంది. అందువల్ల రోజు కనీసం 8 గంటల నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.
ఒత్తిడిని తగ్గించండి
పీరియడ్స్ సమయంలో ఒత్తిడి వల్ల మానసిక కల్లోలం మరింత పెరుగుతుంది. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, శ్వాస తీసుకోవడం చేయాలి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు.
హెల్తీ డైట్
పీరియడ్స్ సమయంలో పోషకమైన, సమతుల్యమైన ఆహరం తీసుకోవాలి. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించి మూడ్ స్వింగ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవచ్చు. దీంతో పాటు చాకోలెట్ వినియోగం కూడా మూడ్ స్వింగ్స్ ను తగ్గిస్తుందని చెబుతారు.
హైడ్రేషన్..
పీరియడ్స్ సమయంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. నీరు తాగడం వల్ల శరీరంలోని తిమ్మిర్లు తగ్గుతాయి. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో కొబ్బరి నీరు లేదా హెర్బల్ టీ తాగడం కూడా మేలు చేస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.