/rtv/media/media_files/2025/04/24/iswVdWGPyZa1BuJxQjep.jpg)
actress Ananya nagalla condolences to pahalgam attack families
Pahalgam Attack పహల్గామ్ ఉగ్రవాదదాడి యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ చేసిన పనికి సోషల్ మీడియా అంతా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. అలాగే అతడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతుని తెలియజేశారు. కొంతసమయం పాటు అక్కడే ఉండి.. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. దీంతో అనన్యపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఉగ్రదాడిపై కనీసం స్పందించని సెలెబ్రెటీలు ఉండగా.. అనన్య వెళ్లి మృతుల ఫ్యామిలీని పరామర్శించడం మెచ్చుకోవాల్సిన విషయం అని కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా ఒక రకమైన దేశభక్తి అని అంటున్నారు.
ఇదిలా ఉంటే గతంలోనూ అనన్య ఖమ్మం, విజయవాడ వరద బాధితులకు తన వంతు సహాయం చేసింది. రూ. 5 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించింది.
telugu-news | latest-news | cinema-news | actress-ananya-nagalla | terror in pahalgam