Actress Abhinaya: ఘనంగా మహేష్ బాబు చెల్లి పెళ్లి .. ఫొటోలు చూశారా

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేష్ బాబు చెల్లిగా నటించిన నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల స్నేహితుడు, బిజినెస్ మెన్ కార్తీక్ ని వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

New Update
actress abhinaya married

actress abhinaya married

Actress Abhinaya: నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.  తన స్నేహితుడు, బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ని వివాహం చేసుకున్నారు. గతనెల 9న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఏప్రిల్ 16న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.  కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అభినయ తన ఇన్ స్టా వేదికగా తెలియజేస్తూ.. పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు అభినయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Also Read: Shine Tom Chacko డ్రగ్స్ వివాదంలో 'దసరా' విలన్ .. హోటల్ నుంచి పారిపోతున్న వీడియో వైరల్!

Also Read: Lucky Zodiac Signs: రేపు ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పు.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

చిన్నప్పటి నుంచే వినికిడి 

నటి అభినయ తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో సిస్టర్ రోల్స్, సహాయక పాత్రలతో  అలరించింది.  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  నేనింతే, డమరుకం, శంభో శివ శంభో, దృవ, దమ్ము, సీతారామం, గామి, రాజుగారి గది2, ఫ్యామిలీ స్టార్  పలు సినిమాల్లో నోటబుల్ రోల్స్ చేసింది. చిన్నతనం నుంచి వినికిడి, మాటలు లేని అభినయ తన అభినయంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'శంభో శివ శంభో' చిత్రానికి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా అభినయకు ఫిల్మ్ ఫెయిర్ అవార్డు వరించింది. సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ అలరించింది అభినయ. రీసెంట్ గా విడుదలైన హాట్ స్టార్ సీరీస్  'మ్యాషియన్ హౌస్' లో నటించింది. 

telugu-news | latest-news | cinema-news

Also Read: Kerela state Awardsలో సత్తా చాటిన 'The Goat Life' ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు