/rtv/media/media_files/2025/04/17/ml27KtfvEpAkg86TnIxI.jpg)
Shine Tom Chacko
Shine Tom Chacko: నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాలో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు షైన్ టామ్ చాకో.. ఇప్పుడు డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కొచ్చిలోని ఓ హోటల్ లో నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించగా.. అతడు తప్పించుకొని పారిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన అర్థరాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ సమయంలో పోలీసులను చూసిన షైన్ హోటల్ మూడవ అంతస్తు నుంచి మెట్ల ద్వారా పరుగెత్తుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కినట్లు సమాచారం.
డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో
— RTV (@RTVnewsnetwork) April 17, 2025
నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్స్ చేసిన నార్కోటిక్ పోలీసులు
పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు ఆరోపణలు
మూడో… pic.twitter.com/06YRlRmNtp
నటి ఆరోపణలతో తనిఖీలు
ఇటీవలే ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్ నటుడు షైన్ పై చేసిన ఆరోపణల ఆధారంగా కొచ్చి అధికారులు ఈ తనిఖీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోలీసులు హోటల్ గది నెం. 314 తలుపు తట్టగానే , షైన్ టామ్ చాకో వారిని చూడగానే విండో ద్వారా బయటకి దూకి పారిపోయినట్టు చెబుతున్నారు. జిల్లా ఎంటి-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ ఈ తనిఖీలు నిర్వహించింది.
విన్సీ అలోషియస్ ఆరోపణలు
అయితే నటి విన్సీ అలోషియస్ ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేస్తూ షైన్ టామ్ చాకోపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా చేస్తున్న సమయంలో షైన్ డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. కారవాన్లోకి తనను పిలవాలని, తనముందే డ్రెస్ మార్చుకోవాలని బలవంతం చేస్తూ వేధించేవాడని మలయాళ మూవీ అసోసియేషన్ AMMA'లో ఫిర్యాదు చేసింది. విన్సీ ఫిర్యాదు మేరకు AMMA' అతడిపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. మలయాళ మూవీ అసోసియేషన్ లో షైన్ చాకో సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తోంది.
telugu-news | latest-news | cinema-news | actor-shine-tom-chacko | Vincy Aloshious