భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఉపేంద్ర సినిమాలు చేస్తున్నారు. ఉపేంద్ర సినిమా అంటే స్టోరీ కొత్తగా ఉంటుందని మనం ముందు ఫిక్స్ అయిపోవాల్సిందే.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం
జాతరను తలపించేలా..
అప్పట్లో ఉపేంద్ర సినిమా రిలీజ్ అవుతుందంటే.. కర్ణాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలపించేలా ఉంటుంది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రిలీజ్ వేడుకలను జరుపుకుంటారు. కానీ గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి కేవలం హీరోగా మాత్రేమే ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు. గతేడాది కబ్జా సినిమాతో ఆడియెన్స్‌ను పలరించాడు. అయితే ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు
ఆయన స్వీయ దర్శకత్వంలో 'యూఐ' అనే సినిమా చేస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా ఈ సిమిమా డిసెంబర్ 20న అనగా రేపు థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని రోజుల కిందట ఈ సినిమా గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌తో ముచ్చటించారు. 'యూఐ' సినిమా సరికొత్త కాన్సెప్ట్.. అని, ఈ సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరన్నారు. ఒకవేళ ఊహిస్తే మీఅంత తెలివైన వారు ఎవరూ ఉండరని ప్రమోషన్స్‌లో భాగంగా అన్నారు.
ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు
కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాల సృష్టిస్తున్నాయి. మరి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న 'యూఐ' సినిమా ఎంత మేర కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 'యుఐ' డబ్బింగ్ మూవీ అయినప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూస్తారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత