/rtv/media/media_files/2025/02/03/T1JoC3CUgRpJrXVTotni.jpg)
Aaradhya Bachchan moved Delhi High Court
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్.. తన తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించుకోకుండా ఎదిగాడు. తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ అందుకున్నాడు. అదే సమయంలో మిస్ వరల్డ్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో వీరికి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలలో క్యూట్ జోడీగా మంచి పేరు ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఆరాధ్య బచ్చన్. ఈమె కూడా సినీ ఇండస్ట్రీకి సుపరిచితమే.
ఆమె చూస్తుండగానే.. పెద్దది అయిపోయింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ తాజాగా కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంత చిన్న వయస్సులో కోర్టుకు పోవాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది అని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి విషయానికొస్తే..
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
ఆరాధ్యపై ఫేక్ ప్రసారం
ఆరాధ్య బచ్చన్‌పై కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్స్ పదే పదే ఆరాధ్యకు సంబంధించి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నాయి. అందులో ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే ‘‘ఆరాధ్య ఇకలేరు’’ అన్నట్లుగా వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం విశేషం. ఈ విషయం అభిషేక్ బచ్చన్ వరకు చేరడంతో ఆయన కోర్టులో కేసు వేశారు.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. చిన్నారిని గౌరవంగా చూడాలని తెలిపింది. వారి ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రసారం చేయరాదని మండిపడింది. ఆరాధ్యపై వచ్చిన ఫేక్ వార్తలను డిలీట్ చేయాలని పలు యూట్యూబ్ ఛానెల్స్ అండ్ గూగుల్, వెబ్‌సైట్‌కు తెలిపింది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డిలీట్ చేసినట్లే చేసి మళ్లీ ప్రసారం చేయడం మొదలెట్టాయి. దీనిపై ఐశ్యర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఫైర్ అయింది. వెంటనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ మార్చి 17కు వాయిదా వేసింది.