/rtv/media/media_files/2025/07/30/amer-khan-2025-07-30-08-55-03.jpg)
Amer Khan
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతని సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'సితారే జమీన్ పర్' మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 2007 లో వచ్చిన తారే జమీన్ పర్‌కు సీక్వెల్‌గా తీశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత ప్రశంసలు అందుకుంది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుండటంతో బాక్సాఫీస్‌ను రికార్డులతో బద్దలకొట్టింది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషనల్‌గా పండింది. క్లాసిక్ హిట్‌ను ఈ మూవీ సంపాదించుకుంది. సాధారణంగా ఏదైనా మూవీ రిలీజ్ అయిన నాలుగు నుంచి ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి ఇష్టం లేదని ఆమీర్ ఖాన్ ముందు నుంచే చెబుతున్న విషయం తెలిసిందే. చెప్పినట్లుగానేఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ మూవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాను ఓటీటీలోకి కాకుండా యూట్యూబ్‌లోకి రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాను యూట్యూబ్లోచూడాటానికి ఓ కండీషన్ పెట్టారు.
ఇది కూడా చూడండి: Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ గూస్ బంప్స్ .. సెట్స్ నుంచి లీకైన సీన్ వైరల్!
Momentous and orbit-breaking: #AamirKhan announces 'Janta Ka Theatre' as 'Sitaare Zameen Par' set to premiere on YouTube for ₹100, marking a new era in Indian cinema after its successful theatrical run.
— Box Office Worldwide (@BOWorldwide) July 29, 2025
A game-changer in film distribution and for the love of the audience. He… pic.twitter.com/BpoUvhIya7
ఇది కూడా చూడండి: 28 Years Later OTT: మెంటలెక్కించే జాంబీ మూవీ అంటే ఇదే భయ్యా! ఎక్కడ చూడొచ్చంటే..?
రూ.100 చెల్లించి..
సితారే జమీన్ పర్ మూవీని ఓటీటీలో కాకుండా యూట్యూబ్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి చూడవచ్చని మూవీ టీం తెలిపింది. అయితే యూట్యూబ్‌లో మూవీ చూడాలంటే ఓ కండీషన్ ఉంది. సాధారణంగా చాలా సినిమాలు యూట్యూబ్‌లో ఫ్రీగా చూస్తారు. కానీ ఈ మూవీని యూట్యూబ్‌లోఫ్రీగా చూడటానికి కుదరదు. సినిమా చూడాలంటే తప్పకుండా రూ.100 చెల్లించాలి. విదేశాల్లో కూడా ఈ మూవీ యూట్యూబ్‌లోస్ట్రీమింగ్ కానుంది. కాకపోతే ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. సినిమా చూడాలనుకునే వారు అద్దె ప్రాతిపదికన యూట్యూబ్‌లో చూడవచ్చు. అయితే కొత్త సినిమాలు యూట్యూబ్‌లోకి రావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇప్పటి వరకు కొత్త సినిమాలు అన్ని కూడా ఓటీటీలోకే వస్తున్నాయి. కానీ ఆమీర్ ఖాన్ ఫస్ట్ టైం ఇలా యూట్యూబ్‌లోకి రిలీజ్ చేసే పద్ధతిని ఎంచుకున్నారు. మరి దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్కలుగుతాయో, లాభాలు ఎలా వస్తాయో చూడాలి. అయితే ఇలా యూట్యూబ్‌లో సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఓటీటీకంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Janhvi Kapoor: జాన్వీ నయా ట్రెండ్.. పింక్ లెహంగాలో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ! పిక్స్ చూశారా
సబ్‌టైటిల్స్‌తో మూవీ..
సితారే జమీన్ పర్ మూవీ యూట్యూబ్‌లో హిందీతో పాటు మిగతా కొన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి. అయితే మూవీని యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది. సాధారణంగా అందరి మొబైల్స్‌లో యూట్యూబ్ ఉంటుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ అనేది కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా ఈ మూవీని చూడలేరు. ఎక్కువ మంది ఈ మూవీని చూడాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్‌లోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆమీర్ ఖాన్ తెలిపారు. తక్కువ ధరకే ప్రతీ ప్రేక్షకుడు కూడా మూవీని చూడాలనేది తన డ్రీమ్ అని వెల్లడించారు. స్పోర్ట్స్ కామెడీ డ్రామాలో వచ్చిన ఈ మూవీ జూన్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆమీర్‌కు జోడీగా జెనిలీయా నటించింది.
ఇది కూడా చూడండి: Bhagyashri Borse: బ్లూ డ్రెస్‌లో జిగేలుమంటున్న కింగ్‌డమ్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాములుగా లేదుగా!