Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ గూస్ బంప్స్ .. సెట్స్ నుంచి లీకైన సీన్ వైరల్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను చకచకా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవలే సుజిత్ 'ఓజీ' షూటింగ్ పూర్తవగా.. ఇప్పుడు ఉస్తాద్ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.

New Update

ఇది రెండవ సినిమా 

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' . దీంతో సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ని సంతోషపెట్టే మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో డీఎస్పీ బ్యాక్ గ్రౌండ్, పవన్ ఎంట్రీ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కెకించాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా ఫీమేల్ లీడ్స్ గా స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు.  'పుష్ప' ఫ్రాంచైజీతో  భారీ విజయం అందుకున్న మైత్రీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

ఇదిలా ఉంటే ఇటీవలే విడుదలైన 'హరిహర వీరమల్లు' పవన్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త  ఆకట్టుకున్నప్పటికీ.. సెకండ్ ఆఫ్ పూర్తిగా నిరాశపరిచింది. సెకండ్ ఆఫ్ లో  కొన్ని సన్నివేశాలోని వీఎఫెక్స్ నాసినాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో మేకర్స్ ఆయా సన్నివేశాల్లో మార్పులు చేసి మళ్ళీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేశారు. దీంతో తదుపరి ప్రాజెక్ట్స్  'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల పైనే ఆశలు పెట్టుకున్నారు.  పవన్ తన కెరీర్ లో ఏ సినిమాకు చేయని విధంగా.. 'హరిహరవీరమల్లు' కోసం ప్రమోషన్స్  చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ లో పాల్గొనడంతో పాటు అనేక మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

Also Read: Vishwambara Update: ‘అవతార్‌’ సినిమా కాపీ కొట్టిన ‘విశ్వంభర’!.. టీజర్ ట్రోలింగ్స్‌పై దర్శకుడు షాకింగ్ రియాక్షన్

Advertisment
తాజా కథనాలు