/rtv/media/media_files/2025/07/30/28-years-later-ott-2025-07-30-07-51-41.jpg)
28 Years Later OTT
28 Years Later OTT:
పాపులర్ హారర్ సిరీస్‌లో లేటెస్ట్ పార్ట్ "28 Years Later Movie" సినిమా ఇప్పుడు ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది.. డైరెక్టర్ డ్యానీ బోయిల్, రైటర్ అలెక్స్ గార్లాండ్ కలసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ విమర్శకుల నుంచి కొంత పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ, ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం $150 మిలియన్ మాత్రమే వసూలు చేయడం వల్ల, ఈ సినిమా చివరి పార్ట్ జరిగేదేనా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడంలో డ్యానీ బోయిల్, అలెక్స్ గార్లాండ్ ఇద్దరూ కొత్తగా, విభిన్నంగా తీసుకువెళ్ళాలనే ప్రయత్నించారు. వారి ఆలోచనలు కొంతమంది విమర్శకులను ఆకట్టుకున్నా, సాధారణ ప్రేక్షకులకు మాత్రం నిరాశనే మిగిలిచింది. Rotten Tomatoes లో యూజర్ రేటింగ్ కేవలం 63% ఉండగా, PostTrak రిపోర్ట్ కూడా నెగటివ్ గానే కనిపిస్తోంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!
ఈ సిరీస్‌ను పూర్తిగా ట్రిలోజీగా మారుస్తామని స్టూడియో Sony ముందుగా ప్రకటించింది. తదుపరి చిత్రం "28 Years Later: The Bone Temple" 2026 జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ, లాస్ట్ పార్ట్ - అలెక్స్ గార్లాండ్ రచించి, డ్యానీ బోయిల్ దర్శకత్వం వహించే సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
"బోన్ టెంపుల్" సక్సెస్ మీద ఇప్పుడు ట్రిలోజీ ఫేట్ ఆధారపడి ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, Sony స్టూడియో మూడవ భాగాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది. అయితే, 2nd పార్ట్ కూడా నిరాశపరిస్తే మాత్రం ఈ సిరీస్ ఇక్కడితో ముగిసిపోవచ్చు. అయితే ప్రస్తుతం అభిమానులు మాత్రం ఈ సినిమాకి చివరి భాగం వస్తుందా లేదా 2nd పార్టే చివరి భాగం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా "28 యియర్స్ లేటర్" సినిమా చూసినప్పుడు, పాత జాంబీ సినిమాలు(Best Zombie Movies) గుర్తుకొస్తాయి. ముఖ్యంగా జాక్ స్నైడర్ దర్శకత్వం వహించిన "Army of the Dead" అనే చిత్రం వెంటనే గుర్తు వస్తుంది. ఈ చిత్రానికి ఉన్న భావోద్వేగాలు, ఫిలాసఫికల్ టచ్, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్న రాజకీయ నేపథ్యం, ఈ సినిమాను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా జోడి కోమర్ ప్రదర్శించిన ఎమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. అంతేకాదు డా, విలియమ్స్ అనే కొత్త నటుడు ప్రధాన పాత్రలో ఎంతో సహజంగా నటించాడు. అతని నటన ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే రాల్ఫ్ ఫైన్స్ పాత్ర సినిమా ఊపుతగ్గుతున్న సమయంలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంది. అతని పాత్ర, యాక్టింగ్ సినిమాకు కొత్త మరింత బలంగా నిలిచింది.
ఈ మూవీలో రాల్ఫ్ ఫైన్స్ చెప్పిన డైలాగ్
“చావు అనేది ఒక్కటి కాదు. చాలా రకాల చావులు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి కూడా.”
ఇలా ఒక్కటే కాదు, సినిమా మొత్తం హై ఇచ్చే డైలాగ్స్ చాలానే ఉన్నాయి. జాంబీ నేపథ్యంలో సాగినా ఈ సినిమా మనుషుల మనస్తత్వం గూర్చి చాలా విషయాలనే చెబుతుంది.
Also Read:మెగా కోడలిగా తొలి సినిమా.. 'సతీ లీలావతి' టీజర్ అదిరింది!
అలాగే, ఈ మూవీ కొన్ని ఘోరమైన సీన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జాంబీల నగ్నత, భయంకరంగా చూపించిన శరీరాలు (body horror) కొంతమందికి అసహ్యంగా అనిపించవచ్చు. అయితే, ఇవన్నీ కథలో భాగంగా ఉన్నప్పటికీ, వాటిని చూపించే విధానం ఎంతో భయానకంగా ఉంటుంది. ప్రోస్థెటిక్స్ వినియోగం ద్వారా చేసిన మేకప్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి.